Share News

పిఎస్ యూ షేర్లు కురిపించెన్‌ సిరులు

ABN , Publish Date - Apr 28 , 2025 | 02:25 AM

పబ్లిక్‌ ఇష్యూకి (ఐపీఓ) వచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చరిత్ర తిరగ రాస్తున్నాయి. ఈ కంపెనీల ఐపీఓలు, ప్రైవేటు కంపెనీల ఐపీఓలను మించి మదుపరులకు లాభాలు పంచాయి. 2017 మే నుంచి ఇప్పటి వరకు...

పిఎస్ యూ షేర్లు కురిపించెన్‌ సిరులు

ఐపీఓ మదుపరులకు భారీ లాభాలు

మజ్‌గాన్‌ డాక్‌ ఐపీఓలో బంపర్‌ రాబడులు

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూకి (ఐపీఓ) వచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చరిత్ర తిరగ రాస్తున్నాయి. ఈ కంపెనీల ఐపీఓలు, ప్రైవేటు కంపెనీల ఐపీఓలను మించి మదుపరులకు లాభాలు పంచాయి. 2017 మే నుంచి ఇప్పటి వరకు ఐపీఓకి వచ్చిన 18 సీపీఎ్‌సయూల్లో మూడు బీమా కంపెనీల ఐపీఓలు తప్ప, మిగతా 15 సీపీఎ్‌సయూల ఐపీఓలు మదుపరులకు బంపర్‌ లాభాలు పంచాయి. 2020 అక్టోబరులో ఐపీఓకు వచ్చిన మజ్‌గాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీఓలో ఇన్వెస్ట్‌ చేసిన వారైతే ఇప్పటి వరకు 37 రెట్ల లాభాలు కళ్ల జూశారు. రైల్‌ వికాస్‌ నిగం లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌), గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ (జీఆర్‌ఎ్‌సఈఎల్‌), ఐఆర్‌సీటీసీ ఐపీఓలూ మదుపరులకు వెయ్యి శాతానికిపైగా లాభాలు పంచాయి.

అగ్రస్థానంలో మజగాన్‌ డాక్‌: రూ.145 ధరతో జారీ అయిన మజ్‌గాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ షేర్లు ఈ నెల 25న బీఎ్‌సఈలో రూ.2,640.75 వద్ద ముగిశాయి. రూ.10 ముఖ విలువతో జారీ చేసిన ఈ షేర్లను కంపెనీ గత ఏడాది డిసెంబరులో రూ.5 ముఖ విలువ ఉండే రెండు షేర్లుగా విభజించింది. ఐపీఓ సమయంలో ఉన్న రూ.10 ముఖ విలువనే పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం మజగాన్‌ డాక్‌ షేర్ల ఽధర రూ.5,281.5. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే ప్రస్తు తం ఈ షేర్లు ఒక్కోటి రూ.5,136.5 లాభంతో ట్రేడవుతున్నాయి.


ఇతర పీఎ్‌సయూలు

రూ.118 ధరతో 2017లో మార్కెట్‌కు వచ్చిన గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ కంపెనీ షేర్లు ప్రస్తుతం రూ.1,616.80 వద్ద ట్రేడవుతున్నాయి. 2017లో రూ.432 ధరతో జారీ చేసిన కొచ్చిన్‌ షిప్‌యార్డు షేర్లు ప్రస్తుతం 590 శాతం లాభంతో రూ.2,979.7 వద్ద ట్రేడవుతున్నాయి. రైల్వే కంపెనీల ఐపీఓలూ మదుపరులకు లాభాలు పంచడంలో ప్రభుత్వ రంగ షిప్పింగ్‌ కంపెనీలతో పోటీపడుతున్నాయి. 2019లో రూ.19 వద్ద లిస్టయిన ఆర్‌వీఎన్‌ఎల్‌ షేర్లు గతవారం 1866 శాతం లాభంతో రూ.373.6 వద్ద ట్రేడయ్యాయి. రూ.320తో జారీ చేసిన ఐఆర్‌సీటీసీ షేర్లూ గత వారం ఇష్యూ ధరతో పోలిస్తే 1,110 శాతం లాభంతో రూ.3,872.75 వద్ద ట్రేడయ్యాయి. రైట్స్‌, ఇర్కాన్‌, రైల్‌టెల్‌, ఐపీఓలూఐ మదుపరులకు ఇష్యూ ధరతో పోలిస్తే 225 నుంచి 243 శాతం లాభాలు పంచాయి. హెచ్‌ఏఎల్‌, బీడీఎల్‌, మిధానీ కంపెనీల ఐపీఓలూ మదుపరులకు 227 నుంచి 605 శాతం వరకు లాభాలు పంచాయి.


ఐపీఓ మార్కెట్‌లో సీపీఎ్‌సయూల లాభాలు

కంపెనీ పేరు ఇష్యూ ధర ప్రస్తుత ధర

మజ్‌గాన్‌ డాక్‌ రూ.145 రూ.2,640.75

గార్డెన్‌ రీచ్‌ రూ.118 రూ.1,616.80

కొచ్చిన్‌ షిపయార్డ్‌ రూ.432 రూ.2,979.7

ఆర్‌వీఎన్‌ఎల్‌ రూ.19 రూ.3733.6

ఐఆర్‌సీటీసీ రూ.320 రూ.3,872.75

ఐఆర్‌ఈడీఏ రూ.32 రూ.178.6

హడ్కో రూ.60 రూ.233

ఎంఎ్‌సటీసీ రూ.120 రూ.540.25

Read Also: Gold Rates Today: నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇవీ

జీవిత బీమా పాలసీదారులకు రైడర్లతో మరింత రక్షణ

జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ఏం కావాలంటే ?

Updated Date - Apr 28 , 2025 | 02:25 AM