Share News

ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్‌లోకి ప్యూర్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:05 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సంస్థ ప్యూర్‌.. ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్‌లోకి అడుగుపెట్టింది. ప్యూర్‌పవర్‌ పేరుతో గృహ. వాణిజ్య, గ్రిడ్‌ విభాగాల కోసం...

ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్‌లోకి ప్యూర్‌

ప్యూర్‌పవర్‌ పేరుతో విడుదల

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సంస్థ ప్యూర్‌.. ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్‌లోకి అడుగుపెట్టింది. ప్యూర్‌పవర్‌ పేరుతో గృహ. వాణిజ్య, గ్రిడ్‌ విభాగాల కోసం ఈ స్మార్ట్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ను తీసుకువచ్చినట్లు వెల్లడించింది. మంగళవారం నాడిక్కడ జరిగిన కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ శాశ్వత సభ్యుడు వీకే సారస్వత్‌, ప్యూర్‌ వ్యవస్థాపకుడు, ఎండీ నిశాంత్‌ దొంగరి, సహ వ్యవస్థాపకుడు రోహిత్‌ వధేరా ప్యూర్‌పవర్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిశాంత్‌ మాట్లాడుతూ.. సాధారణ ఇన్వర్టర్లతో పోల్చితే ఈ ఎనర్జీ సొల్యూషన్స్‌ పూర్తిగా ప్రత్యేకమైనవని అన్నారు. 3,5,15 కేవీఏ సామర్థ్యాల్లో తీసుకువచ్చిన ఈ ఎనర్జీ సొల్యూషన్స్‌తో ఏసీలు, గీజర్లు సహా హెవీ డ్యూటీ గృహోపకరణాలను వాడుకోవచ్చని నిశాంత్‌ తెలిపారు. ఏఐ యాప్‌ ఆధారిత మానిటరింగ్‌, ఉచిత మెయింటెనెన్స్‌, 10 ఏళ్లకు పైగా జీవితకాలం వీటి ప్రత్యేకత అని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ ఎనర్జీ సొల్యూషన్స్‌ను సాధారణ విద్యుత్‌తో పాటు రూఫ్‌టాప్‌ సోలార్‌తో చార్జింగ్‌ చేసుకునే విధంగా డిజైన్‌ చేసినట్లు ఆయన వివరించారు.


3కేవీఏ ఎనర్జీ సొల్యూషన్స్‌ ధర రూ.74,999గా ఉండగా 5 కేవీఏ ధర రూ.99,999, 15కేవీఏ ధర రూ.1,74,999గా ఉన్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి వీటి బుకింగ్స్‌ను ప్రారంభించి అదే నెల 30 నుంచి డెలివరీలను ప్రారంభించనున్నట్లు నిశాంత్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఐఐటీ సమీపంలోని ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా వచ్చే ఏడాది గంటకు 4 మెగావాట్ల సామర్థ్య గల భారీ ఎనర్జీ స్టోరేజీ సామర్థ్యం గల ప్యూర్‌పవర్‌ గ్రిడ్‌ను తీసుకురానున్నట్లు నిశాంత్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:05 AM