77000 పైన సెన్సెక్స్
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:41 AM
స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 309.40 పాయింట్ల లాభంతో 77,044.29 వద్ద, నిఫ్టీ 108.65 పాయింట్ల లాభంతో 23,437.20 వద్ద ముగిశాయి....
ముంబై: స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 309.40 పాయింట్ల లాభంతో 77,044.29 వద్ద, నిఫ్టీ 108.65 పాయింట్ల లాభంతో 23,437.20 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ గత రెండు వారాల్లో ఇంత గరిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 77,110.23-76,543.77 మధ్య ఆటుపోట్లకు లోనైంది. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, టెలికం, ఆర్థిక సేవల కంపెనీల షేర్లకు బుధవారం చక్కటి కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో కంపెనీల షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ సంవత్సరం వరుణుడు బాగానే కరుణిస్తాడనే వాతావరణ శాఖ ప్రకటన కూడా ఇందుకు దోహదపడింది.
ఇండ్‌సఇండ్, ఐరెడా షేర్లలో ర్యాలీ : ఇటీవల తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన ఇండ్‌సఇండ్ బ్యాంకు, ఐఆర్‌ఈడీఏఎల్ కంపెనీల షేర్ల బుధవారం మంచి లాభాలతో ముగిశాయి. ఇండ్‌సఇండ్ బ్యాంకు షేర్లు 7.12 శాతం లాభంతో రూ.788.25 వద్ద, ఐఆర్‌ఈడీఏఎల్ షేర్లు 5.57 శాతం లాభంతో రూ.176.40 వద్ద ముగిశాయి.
Read More Business News and Latest Telugu News