Share News

Trumps Liberation Day Tariffs Fears: ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ ప్రతీకార సుంకాలు.. స్టాక్ మార్కట్‌ ఒడిదుడుకులపై భారత్‌లో భయాలు

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:37 PM

ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్నాయి. దీంతో, భారత మార్కెట్లు మరోసారి కరెక్షన్‌కు లోనుకావొచ్చన్న అంచనాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

Trumps Liberation Day Tariffs Fears: ఏప్రిల్ 2 నుంచి ట్రంప్ ప్రతీకార సుంకాలు.. స్టాక్ మార్కట్‌ ఒడిదుడుకులపై భారత్‌లో భయాలు
Trumps Liberation Day Tariffs Fears

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించబోయే ప్రతీకార సుంకాల డెడ్‌లైన్ దగ్గరపడింది. లిబరేషన్ డేగా జనాల నోళ్లల్లో నానుతున్న ఏప్రిల్ 2 డెడ్‌లైన్‌పై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. అమెరికా ప్రయోజనాలే లక్ష్యమని ట్రంప్ మొదటి నుంచీ చెబుతున్నారు. తమ దేశ ఉత్పత్తులపై భారీగా సుంకాల విధిస్తు్న్న దేశాలపై ప్రతీకార టారిఫ్‌లు వడ్డిస్తామని గతంలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చర్చలకు వీలుగా ఏప్రిల్ 2 వరకూ సుంకాల విధింపును వాయిదా వేశారు. దీంతో, తదుపరి ఏం జరగబోతోందా? అన్న ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. భారీ సుంకాలకు ట్రంప్ సిద్ధమైతే మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతాయని భారత మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఇప్పటికే భారతీయ మార్కెట్లు కరెక్షన్లు చవిచూశాయి. దేశ ఆర్థిక రంగంలో మందకొడితనం, కార్పొరేట్ ఆదాయాల్లో కోత, ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఇక ట్రంప్ సుంకాల వడ్డింపు భారీగా ఉంటే మార్కెట్‌లో మళ్లీ అమ్మకాల జోరు పెరిగే అవకాశం మెండుగా ఉంది.


Also Read: ఈ సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌కు ఏయే రోజుల్లో సెలవలంటే..

ప్రతీకార సుంకాల భయాల ప్రభావంతో అమెరికా మార్కెట్ సూచీలు ఇప్పటికే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. డో జోన్స్ 715.8 పాయింట్స్ పడిపోగా, ఎస్ అండ్ పీ ఇండెక్స్ 112.37 పాయింట్ల మే దిగజారింది. ట్రంప్ సుంకాల ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న భారత్, థాయిల్యాండ్, బ్రెజీల్ దేశాలపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. అయితే, టారిఫ్‌లే కాకుండా ఇతర అనేక అంశాల ఆధారంగా అమెరికా ప్రతీకార సుంకాలు విధిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Stock Prediction: టెక్‌ వ్యూ : 23,400 వద్ద కన్సాలిడేషన్‌

వివిధ దేశాలతో అమెరికా వాణిజ్యం, వాణిజ్య లోటు, వాట్ రేట్లు, డిజిటల్ పన్నులు, తదితర అంశాలను పరిశీలిస్తున్న అమెరికా వాణిజ్య శాఖ, ఇతర అధికారులు తమ నివేదికను ఏప్రిల్ 1న విుదల చేయనున్నారు. వీటితో పాటు భౌగోళిక రాజకీయ అంశాలు కూడా ట్రంప్ ప్రతీకార సుంకాల విధానాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. భారత్‌పై భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలు పడని పక్షంలో స్టాక్ మార్కెట్లో ఎఫ్‌పీఐ నిధుల వెల్లువ యథావిధిగా కొనసాగుతుందని కూడా కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ కార్లపై 25 శాతం సుంకం కూడా ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానుంది. అయితే, కొన్ని భారతీయ సంస్థలకు అమెరికాలోనూ కార్ల తయారీ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ కంపెనీలపై సుంకాల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అంటున్నారు. స్టాక్ మార్కెట్‌ ఇప్పటికే పలుమార్లు కరెక్షన్‌కు లోనైందని, మరింత కరెక్షన్‌కు అవకాశం తక్కువన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Read Latest and Business News

Updated Date - Mar 31 , 2025 | 03:53 PM