Stock Market Update: మార్కెట్ పడుతుందా.. పెరుగుతుందా?
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:31 AM
సెన్సెక్స్ ప్రారంభంలో 78,750 వరకూ చేరింది ఆ తర్వాత 78,150 వరకూ దిగింది. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్‌పయిరీ కూడా ఉండటంతో మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి.

Stock Market Update: వరుసగా 7వ రోజు లాభాల పరంపరని కొనసాగిస్తున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. నేడు కూడా ర్యాలీని కొనసాగిస్తూ ట్రేడింగ్‌ను మొదలైనప్పటికీ ఉదయం 9.45 గంటల తర్వాత నుంచి క్రమంగా మార్కెట్లు తగ్గుతూ వస్తున్నాయి. ఉదయం 9.25 సమయంలో నిఫ్టీ 23,870 వద్దకు చేరి తర్వత 23,700 వరకూ పడింది.
సెన్సెక్స్ ప్రారంభంలో 78,750 వరకూ చేరింది ఆ తర్వాత 78,150 వరకూ దిగింది. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్‌పయిరీ కూడా ఉండటంతో మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. ఒక దశలో నిఫ్టీ 23, 800 మార్క్ ను చేరుకోగా హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్ నేడు ప్రధాన గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇక రూపాయి మారకం విలువ ఇవాళ కొంచెం పుంజుకొని రూ. 85.70 దగ్గర ఉంది. కొంత కాలంగా భారీగా అమ్మకాలకు పాల్పడ్డ ఎఫ్‌ఐఐలు మళ్లీ కొనుగోళ్లు మొదలు పెట్టడంతో మార్కెట్ ఇవాళ కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. ఇక, నిన్న అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగియగా, ఇవాళ ఆసియా-పసిఫిక్‌లోని ప్రధాన మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 160 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
IPO Calender: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌కు కొత్త జోష్.. 4 ఐపీవోలు, 5 లిస్టింగ్స్
Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల
Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!
Read Latest Business News And Telugu News