Share Market closing bell: భారీ నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:33 PM
ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఏడు సెషన్ల ర్యాలీ తర్వాత ఇవాళ బుధవారం తిరోగమనం బాట పట్టాయి.

Stock Market: గత వారం వరుసగా ఆరు రోజుల పాటు భారీ ఎత్తున పెరిగిన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల బాటన పయనించాయి. నిన్న నిఫ్టీ 10 పాయింట్లు, సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో గట్టెక్కగా, ఇవాళ బుల్ దెబ్బకు బేర్ మాన్నాయి. ఇవాళ నిఫ్టీ 181 పాయింట్లు కోల్పోగా, సెన్సెక్స్ 728 పాయింట్లు నష్ట పోయింది. నిన్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 97 పాయింట్లు కోల్పోగా, ఇవాళ ఉదయం నుంచీ నష్టాల్లో కొనసాగింది. చివరికి 398 పాయింట్ల నష్టంతో ముగించింది.
నిన్న అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్ 4 పాయింట్ల లాభంతో ప్లాట్‌గా ముగియగా, ఎస్‌అండ్‌పీ సూచీ 13 పాయింట్లు , నాస్‌డాక్ 0.46 శాతం లాభపడ్డాయి. ఇటు, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడయ్యాయి. జపాన్ నిక్కీ 0.71 శాతం, హాంకాంగ్ హాంగెసెంగ్ 0.60 శాతం లాభంతో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 72.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.72 వద్ద కొనసాగుతోంది. ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఏడు సెషన్ల ర్యాలీ తర్వాత ఇవాళ తిరోగమనం బాట పట్టాయి. US టారిఫ్ విధానాలపై స్పష్టత లేకపోవడంతో పెట్టుబడిదారులు లాభాల బుకింగ్‌ను ఆశ్రయించారు.
మార్కెట్లు ఉదయం ప్రారంభం కాగానే నిఫ్టీ 67.85 పాయింట్లు పెరిగి 23,736.50 కి చేరుకున్న తర్వాత కీలకమైన 23,600 మార్కు కంటే దిగువకు పడిపోయి 23,486 వద్ద స్థిరపడింది. ఇక, సెన్సెక్స్ విషయానికొస్తే, ఈ ఉదయం స్థిరంగా ప్రారంభమైన సెన్సెక్స్, ఇంట్రాడేలో 150.68 పాయింట్లు లాభపడి 78,167.87 గరిష్ట స్థాయిని తాకింది.
అయితే, ఎంపిక చేసిన హెవీ వెయిట్ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి ఇండెక్స్‌ను 77,288.50 కనిష్ట స్థాయికి చేర్చాయి. వెనుకబడిన వాటిలో, టెక్ మహీంద్రా, ఎన్‌టిపిసి, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వంటివి సూచీలపై ప్రభావం చూపాయి.
ఇవి కూడా చదవండి :
కూతవేటు దూరంలో హత్య జరుగుతున్నా పోలీసుల నిద్ర.. వీడియో వైరల్
ఇక నా వల్ల కాదమ్మా.. చనిపోతున్నా