Stock Markets Closing Bell: తీవ్ర ఒడిదుడుకుల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:40 PM
ట్రంప్ టారిఫ్ భయాల నేపథ్యంలో ఈ ఏడాది చివరి మార్కెట్ సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగి, చివరికి నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు కూడా ఇవాళ నష్టాల్లో ఉండటం విశేషం.

Stock Market Closing Bell : భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈ ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగ్ సెషన్ అయిన ఇవాళ(శుక్రవారం) నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు నేడు నష్టాల్లో ఉండటం విశేషం. ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు ఫ్లాట్‌గా మొదలైనప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఒక్కసారిగా లేవడం, తర్వాత భారీగా పడిపోవడం, మళ్లీ కాస్త రికవరీ అవడం ఇదీ.. ఇవాల్టి మార్కెట్లో కనిపించిన దృశ్యం. మార్కెట్ ఇవాళ అధిక ఓలటాలిటీని చూపించింది. మార్కెట్ ముగిసే సమాయానికి సెన్సెక్స్ (Sensex) 191.51 పాయింట్లు నష్టంతో 77,414.92 వద్ద ముగియగా.. నిఫ్టీ (Nifty) 72.60 పాయింట్ల నష్టంతో 23,519.35 దగ్గర ముగిసింది. నిన్న ఒక్క యూఎస్ 30 ఇండెక్స్ తప్పించి మిగతా అమెరికా సూచీలు రెడ్ లో క్లోజ్ అవగా, ఇవాళ అమెరికా, యూరప్, ఆసిమా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి.
ఇవాల్టి మార్కెట్లో కనిపించిన దృశ్యం. మార్కెట్ ఇవాళ అధిక ఓలటాలిటీని చూపించింది. మార్కెట్ ముగిసే సమాయానికి సెన్సెక్స్ (Sensex) 191.51 పాయింట్లు నష్టంతో 77,414.92 వద్ద ముగియగా.. నిఫ్టీ (Nifty) 72.60 పాయింట్ల నష్టంతో 23,519.35 దగ్గర ముగిసింది. నిన్న ఒక్క యూఎస్ 30 ఇండెక్స్ తప్పించి మిగతా అమెరికా సూచీలు రెడ్ లో క్లోజ్ అవగా, ఇవాళ అమెరికా, యూరప్, ఆసిమా మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి.
FMCG, చమురు, గ్యాస్ మినహా, అన్ని రంగాల షేర్లు ఇవాళ కరెక్ట్ అయ్యాయి. ఐటీ, ఆటో, రియాల్టీ, ఇంకా మీడియా రంగాల షేర్లు 1 నుంచి 2 శాతం తగ్గాయి. విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ సెన్సెక్స్‌లో ప్రధాన నష్టాలను చవిచూశాయి, అయితే టాటా కన్స్యూమర్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ONGC, ICICI బ్యాంక్ లాభపడ్డాయి. BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం తగ్గాయి. ఇవాళ్టి సెషన్లో దాదాపు 1454 షేర్లు లాభపడ్డాయి. 2399 షేర్లు క్షీణించాయి. 116 షేర్లు స్తబ్ధుగా ఉన్నాయి.
ఇవీ చదవండి:
సరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం
పాక్ ఆర్మీ చీఫ్‌పై తిరుగుబాటు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి