Share News

టెక్‌ వ్యూ : 23,400 వద్ద కన్సాలిడేషన్‌

ABN , Publish Date - Mar 31 , 2025 | 05:43 AM

నిఫ్టీ గత వారం గరిష్ఠ స్థాయి 22,850 నుంచి బలమైన రియాక్షన్‌ సాధించి వారం మొత్తం మీద కేవలం 170 పాయింట్ల లాభంతో 23,500 ముగిసింది. ఇది అప్రమత్త సంకేతం. కనిష్ఠ స్థాయిల నుంచి 2,000 పాయింట్ల మేరకు...

టెక్‌ వ్యూ : 23,400 వద్ద కన్సాలిడేషన్‌

టెక్‌ వ్యూ : 23,400 వద్ద కన్సాలిడేషన్‌

నిఫ్టీ గత వారం గరిష్ఠ స్థాయి 22,850 నుంచి బలమైన రియాక్షన్‌ సాధించి వారం మొత్తం మీద కేవలం 170 పాయింట్ల లాభంతో 23,500 ముగిసింది. ఇది అప్రమత్త సంకేతం. కనిష్ఠ స్థాయిల నుంచి 2,000 పాయింట్ల మేరకు లాభపడినందు వల్ల ఈ తరహా టెక్నికల్‌గా కరెక్షన్‌ రావడం అవసరం. అమెరికన్‌ మార్కెట్లలో గత శుక్రవారం నాటి బలమైన రియాక్షన్‌ కారణంగా ట్రెండ్‌లో మరింత అప్రమత్తతకు ఆస్కారం ఉంది. మిడ్‌క్యాప్‌-100, స్మాల్‌క్యాప్‌-100 సూచీలు కూడా గత వారం స్వల్ప రియాక్షన్‌ సాధించాయి.

బుల్లిష్‌ స్థాయిలు : ఊహిస్తున్న విధంగా అప్రమత్త సానుకూల ధోరణి ప్రదర్శించినట్టయితే మరింత సానుకూలత కోసం నిరోధ స్థాయి 23,600 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 23,800, 24,000.

బేరిష్‌ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినా భద్రత కోసం మైనర్‌ మద్దతు స్థాయి 22,400 వద్ద రికవరీ సాధించాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన స్వల్పకాలిక మద్దతు స్థాయి 22,000. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు.

బ్యాంక్‌ నిఫ్టీ : ఈ సూచీ గత వారం ప్రధాన స్థాయి 52,000 వద్ద రియాక్షన్‌ సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. స్వల్పకాలిక కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం స్వల్పకాలిక నిరోధం 52,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. స్వల్పకాలిక మద్దతు స్థాయి 50,800. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది.


పాటర్న్‌ : మార్కెట్‌ ప్రస్తుతం 100 డిఎంఏ వద్ద రియాక్షన్‌ సాధిస్తోంది. స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితి వల్ల కూడా రియాక్షన్‌ ఏర్పడుతోంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం 23,400 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా పైన నిలదొక్కుకోవాలి.

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 23,540, 23,600

మద్దతు : 23,455, 23,400

వి. సుందర్‌ రాజా

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 31 , 2025 | 05:43 AM