ఐటీ కుదేల్.. ఫార్మా జిగేల్
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:04 AM
ముంబై: ట్రంప్ పరస్పర సుంకాలు భారత స్టాక్ మార్కెట్‌పై మిశ్రమ ప్రభావం చూపాయి. ఔషధాలకు ఈ సుంకాల నుంచి మినహాయింపునివ్వడంతో ఫార్మా రంగ షేర్లు భారీగా పుంజుకోగా..

ముంబై: ట్రంప్ పరస్పర సుంకాలు భారత స్టాక్ మార్కెట్‌పై మిశ్రమ ప్రభావం చూపాయి. ఔషధాలకు ఈ సుంకాల నుంచి మినహాయింపునివ్వడంతో ఫార్మా రంగ షేర్లు భారీగా పుంజుకోగా.. సుంకాల కారణంగా అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చని, వాణిజ్య యుద్ధాలకు దారితీయవచ్చని, అది దేశీయ ఐటీ కంపెనీల ఆదాయాలకు ప్రతికూలంగా పరిణమించవచ్చన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు ఆ రంగానికి చెందిన షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో బీఎ్‌సఈలోని ఫోకస్డ్ ఐటీ సూచీ 4.13 శాతం క్షీణించగా.. ఐటీ 3.78 శాతం, టెక్ ఇండెక్స్ 2.85 శాతం తగ్గాయి. ఫార్మా కంపెనీల ప్రాతినిథ్య సూచీ హెల్త్‌కేర్ 1.82 శాతం పెరిగింది.
సెన్సెక్స్ 322 పాయింట్లు డౌన్ : ట్రంప్ సుంకాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 809.89 పాయింట్లు క్షీణించి 75,807.55 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 322.08 పాయింట్ల నష్టంతో 76,295.36 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ప్రారంభ ట్రేడింగ్‌లో 186.55 పాయింట్ల వరకు పతనమైనప్పటికీ, చివర్లో 82.25 పాయింట్ల నష్టంతో 23,250.10 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని నాలుగు ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా 3.98 శాతం వరకు నష్టపోయి సూచీ టాప్ లూజర్లుగా మిగిలాయి. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.35,170 కోట్ల మేర పెరిగి రూ.413.33 లక్షల కోట్లకు చేరింది.
ఐటీ
షేరు నష్టం(%)
పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 9.92
కోఫోర్జ్ 7.77
కేపీఐటీ టెక్నాలజీస్ 7.66
ఎంఫసిస్ 4.05
టీసీఎస్ 3.98
టెక్ మహీంద్రా 3.79
హెచ్‌సీఎల్ టెక్ 3.71
ఎల్‌టీఐమైండ్‌ట్రీ 3.51
ఇన్ఫోసిస్ 3.41
విప్రో 2.75
సైయెంట్ 2.67
ఫార్మా
షేరు లాభం(%)
జుబిలియెంట్ ఫార్మా 6.82
ఇప్కా ల్యాబ్స్ 5.77
లుపిన్ 4.24
నాట్కో ఫార్మా 3.73
సన్ ఫార్మా 3.26
సిప్లా 2.92
సువెన్ ఫార్మా 2.89
దివీస్ ల్యాబ్స్ 1.90
గ్లెన్‌మార్క్ ఫార్మా 1.89
గ్లాండ్ ఫార్మా 1.75
గ్రాన్యూల్స్ ఇండియా 1.72
అరబిందో ఫార్మా 1.50
టొరెంట్ ఫార్మా 1.09
డాక్టర్ రెడ్డీస్ 0.13
Read Also: ITR Filing 2025: ఫారం-16 ఉంటేనే ITR ఫైలింగ్ చేయగలమా.. లేకపోతే ఏం చేయాలి..
Lays Offs: ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి
Today Gold Rate: స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఇకపై ఏడాదికి రెండు సార్లు డీఏ

భారీ లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..మదుపర్ల సంతోషం

10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముద్రా స్కీం..రూ. 20 లక్షల ఈజీ రుణాలు

వావ్ మళ్లీ తగ్గిన బంగారం ధరలు..కానీ షాకిచ్చిన వెండి
