బ్యాంకుల్లోని అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.78,000 కోట్ల పైమాటే..
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:14 AM
దేశంలోని బ్యాంకుల్లో అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.78,213 కోట్లు దాటాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునేందుకు...

వీటిని క్లెయిమ్ చేసుకునేందుకు ఏప్రిల్ నుంచి సులభతర విధానం
న్యూఢిల్లీ: దేశంలోని బ్యాంకుల్లో అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.78,213 కోట్లు దాటాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకులు ఈ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునేందుకు సులభతర విధానాన్ని వచ్చే నెల నుంచి ప్రవేశపెట్టనున్నాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లో అన్-క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఖాతదారుల వివరాలు, పబ్లిక్ సెర్చ్ ఫీచర్‌తో సహా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఖాతాదారు లేదా నామినీ డిపాజిట్‌ను తిరిగి తీసుకునేందుకు స్టాండర్డ్ అప్లికేషన్‌తో పాటు డిక్లరేషన్ ఫామ్స్‌ను, సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. డిపాజిట్ సొమ్మును క్లెయిమ్ చేసుకునే దరఖాస్తుదారు తన పేరు, మొబైల్ నంబరు, చిరునామా వంటి వివరాలను అప్లికేషన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. అనంతరం, సంబంధిత బ్యాంకు శాఖ దరఖాస్తును తనిఖీ చేసి, సొమ్మును సెటిల్ చేస్తుందని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉన్నతోద్యోగి ఒకరు వెల్లడించారు. అన్‌లైన్ ద్వారా అన్-క్లెయిమ్డ్ డిపాజిట్ల రికవరీ విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్‌బీఐకి చెందిన ఉద్గమ్ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. అనంతరం సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించి సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు.
రూ.45,000 కోట్లు ప్రత్యేక ఫండ్‌కు బదిలీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు 2019-20 నుంచి 2024-25 (గత ఏడాది డిసెంబరు 31 వరకు) మధ్య కాలంలో రూ.45,000 కోట్లకు పైగా అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్‌బీఐ నిర్వహణలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ స్వయంగా ఈ విషయాన్ని లోక్‌సభకు వెల్లడించింది. సేవింగ్, కరెంట్ ఖాతాల్లో 10 ఏళ్లపాటుగా క్రియారహితంగా ఉన్న సొమ్మును లేదా కాలపరిమితి ముగిసి 10 ఏళ్లయిన టర్మ్ డిపాజిట్లను బ్యాంక్‌లు అన్-క్లెయిమ్డ్ డిపాజిట్లుగా వర్గీకరిస్తాయి.
ఇవి కూడా చదవండి:
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News