UP: పెళ్లిలో డీజే పాటలపై వివాదం.. గొడవ నుంచి పారిపోయిన టీనేజర్ బావిలో పడి మృతి
ABN , Publish Date - Apr 20 , 2025 | 09:00 PM
పెళ్లి ఊరేగింపులో ప్లే చేయాల్సిన పాటలపై రేగిన వివాదం ఓ యువకుడిని బలి తీసుకుంది. గొడవ నుంచి పారిపోయే ప్రయత్నంలో సదరు టీనేజర్ బావిలో పడి మృతి చెందాడు.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి ఊరేగింపులో తలెత్తిన వివాదం తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో ఓ టీనేజర్ బావిలో పడి మృతి చెందిన ఘటన యూపీలో వెలుగు చూసింది. ఈ ఘటనలో మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. సోన్‌భద్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శనివారం పోఖ్రాచెయిన్‌పూర్ నుంచి సార్దీహా గ్రామంలోని రామ్‌సానే విశ్వకర్మ అనే వ్యక్తి ఇంటి వరకూ పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపులో ఏ పాటలు ప్లే చేయాలనే విషయంలో వివాదం తలెత్తింది. ఊరేగింపు చూడటానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులతో పెళ్లి వారు వాగ్యుద్ధానికి దిగారు. వివాదం ముదిరి వారిపై దాడి చేశారు.
‘‘ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు మోహిత్ యాదవ్ (17), మరో వ్యక్తి చీకట్లో పారిపోయారు. చివరకు బావిలో పడ్డారు. టీనేజ్ యువకుడు బావిలోనే కన్నుమూయగా మరో వ్యక్తిని బయటకు తీశారు’’ అని సర్కిల్ ఆఫీసర్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీనేజర్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ యువకుడికి ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు సీఓ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య.. న్యాయం జరగకపోతే అస్థికలు డ్రైనేజీలో కలపాలని విజ్ఞప్తి
భార్యను చంపిన వృద్ధుడు.. ఆమె తలను సంచీలో తీసుకెళ్లి..
ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు