Share News

Agra: మహిళా ఆటో డ్రైవర్‌పై అత్యాచారం.. కూతురికి మిలిటరీ స్కూల్లో సీటు ఇప్పిస్తామని చెప్పి..

ABN , Publish Date - Apr 20 , 2025 | 05:48 PM

ఆగ్రాలో ఓ మహిళా ఆటో డ్రైవర్ అత్యాచారానికి గురైంది. బాధితురాలి కూతురికి మిలిటరీ స్కూల్లో సీటును ఆశపెట్టి నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

Agra: మహిళా ఆటో డ్రైవర్‌పై అత్యాచారం.. కూతురికి మిలిటరీ స్కూల్లో సీటు ఇప్పిస్తామని చెప్పి..
Agra Incident

ఇంటర్నెట్ డెస్క్: ఆగ్రాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తమని తాము ఆర్మీ జవాన్లుగా చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు బాధితురాలి కూతురికి మిలిటరీ స్కూల్లో సీటు ఇప్పిస్తామని అడ్డు చెప్పి ఆమెను బలాత్కరించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్న 36 ఏళ్ల మహిళ ఆటోను నిందితులు ఎక్కారు. ఈ సమయంలో వారు తమని తాము ఆర్మీ జవాన్లుగా చెప్పుకున్నారు. మాటల మధ్యలో మహిళ తన కూతురికి మిలిటరీ స్కూల్లో సీటు గురించి వారితో చర్చించింది. తాము ఈ విషయంలో సహకరిస్తామని వారు చెప్పారు. తాము ఉంటున్న హోటల్‌కు రాస్తే తీరిగ్గా ఈ విషయమై చర్చిద్దామని అన్నారు.


‘‘గురువారం వారు నన్ను హోటల్‌కు పిలిచారు.. ఆ తరువాత తుపాకీతో బెదిరించి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నా కూతురికి కూడా హాని తలపెడతామని బెదిరించారు’’ అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహిళ ఫిర్యాదు మేరకు రకాబ్‌గంజ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 70(1) కింద కేసు నమోదు చేసుకున్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు అడిషనల్ ఏసీపీ తెలిపారు.


కాగా పోలీసుల విచారణలో ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఇద్దరు బులంద్‌షహర్ ప్రాంతానికి చెందిన వారిగా తెలిసింది. హోటల్‌‌లో సీసీటీవీ ఫుటేజీ‌తో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు బులంద్‌షహర్‌కు పోలీసు బృందాలను పంపించారు.

ఇవి కూడా చదవండి:

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య.. న్యాయం జరగకపోతే అస్థికలు డ్రైనేజీలో కలపాలని విజ్ఞప్తి

భార్యను చంపిన వృద్ధుడు.. ఆమె తలను సంచీలో తీసుకెళ్లి..

ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు

Read Latest and Crime News

Updated Date - Apr 20 , 2025 | 05:48 PM