Zodiac Signs: మీరు ఈ రాశిలో పుట్టారా మీకు బ్యాడ్ టైమ్ స్టార్ కాబోతుందని తెలుసా
ABN , Publish Date - Mar 29 , 2025 | 02:23 PM
Zodiac Signs: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 12 రాశులకు భిన్నమైన ఫలితాలు సూచిస్తోంది. ముఖ్యంగా మీనరాశి వారు జ్యోతిష్యపరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోనున్నారు.

ఉగాది పర్వదినం తెలుగు కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నూతన సంవత్సరం అంటే మార్చి 30, 2025 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు చూపించబోతోంది. ఏ రాశి వారు తెలుగు కొత్త సంవత్సరంలో సవాళ్లను ఎదుర్కోబోతున్నారో చూద్దాం. ముఖ్యంగా తెలుగు కొత్త సంవత్సరంలో మీన రాశి వారు జ్యోతిష్యపరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కోనున్నారు. ఈ రాశి వారికి గ్రహ సంచారం, శని ప్రభావం ప్రతికూల ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ సరైన జాగ్రత్తలు, పరిహారాలతో సానుకూల ఫలితాలు పొందే మార్గాలు ఉన్నాయి.
ఎలాంటి సవాళ్లు ఎదుర్కుంటారు..
శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీన రాశి వారికి మార్చి 29, 2025 నుంచి శని జన్మ రాశిలోకి ప్రవేశిస్తాడు. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు శని ప్రభావం కొనసాగనుంది. ఇది ఏలి నాటి శని దశ ప్రారంభాన్ని సూచిస్తోంది. శని ప్రభావంతో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా కుటుంబ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మే 18 నుంచి రాహువు కుంభ రాశిలోకి, కేతువు సింహ రాశిలోకి మారడంతో వ్యక్తిగత జీవితంలో కూడా ఒత్తిడి తప్పదు.
ఈ సంవత్సరంలో ఖర్చులు భారీగా ఉంటాయి. ఉద్యోగస్థులు పని ఒత్తిడితో పాటు, తోటి ఉద్యోగులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు ఏకాగ్రతలో లోపం, పరీక్షలో అడ్డంకులు ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురికావచ్చు. అయితే ఆగస్టు - సెప్టెంబర్ నెలలో గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో కొంత మేరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు.. పరిహారాలు ఇవే
ఈ సవాళ్ల నుంచి మీన రాశి వారు సానుకూల ఫలితాలు పొందాలంటే కొన్ని జాగ్రత్తలు, పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. శని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతీ శనివారం నల్ల గుర్రం లేదా నల్ల ఆవుకు ఆహారం పెడితే మంచిది. ‘ఓం శం శనైశ్చరయా నమ:’ అంటూ శని మంత్రాన్ని రోజూ 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతే కాకుండా శని దేవాలయాల్లో నీలం రాయిని దానం చేస్తే కూడా కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
ఆర్థిక నష్టాల నుంచి..
ఆర్థికంగా నష్టాల నుంచి బయటపడాలంటే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవద్దు. అలాగే అనవసరపు ఖర్చులను మానుకోవాలి. ఆరోగ్య సమస్యల నుంచి బయటడాలంటే రోజు 30 నిమిషాలు ధ్యానం, యోగా చేస్తే మంచిది. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
కుటుంబ సమస్యల విషయంలో..
కుటుంబ సమస్యలు విషయంలోనూ కొన్ని సూచనలు పాటిస్తే మంచిది. ముఖ్యంగా కుటుంబ సమస్యలను ఎదర్కోకుండా ఉండేందుకు సహనం, సంభాషణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయలాకే గొడవలు పడకుండా సర్దుకుపోయే అలవాటు చేసుకోవాలి. విద్యార్థులు చదువు విషయంలో ఏకగ్రత పొందాలంటే సరస్వతిని పూజించాలి. ‘ఓం ఐం సరస్వత్వై నమ:’ అనే మంత్రం జపిస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
వాస్తవిక ఆశావాదం
శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీన రాశి వారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆగస్టు- సెప్టెంబర్ నెలలో గురువు అనుకూలత వల్ల ఆర్థిక లాభం, కుటుంబం విషయంలో కొంత మేర ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు పలు జాగ్రత్తలు తీసుకుంటే సానుకూలత సాధ్యమని పండితులు చెబుతున్నారు. మీనరాశి వారు ఈ సంవత్సరం శని ప్రభావాన్ని సమతుల్యం చేసేందుకు ఆధ్యాత్మిక, వాస్తవిక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ధైర్యంతో ముందుకు సాగితే సవాళ్లను అవకాశాలుగా మార్చుకునే వీలుంటుంది.
ఇవి కూడా చదవండి
Ugadi Special: ఉగాది పచ్చడి వెనుక రహస్యం తెలిస్తే తినకుండా వదిలిపెట్టరు
Today Horoscope: ఈ రాశి వారికి ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది
Read Latest Devotional News And Telugu News