Home » Devotional
హనుమాన చాలీసా ప్రచార సమితి, పవన యువజన సేవా ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీన భారీ ఎత్తున హనుమాన చాలీసా పార్యాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని లలితకళా పరిషతలో బుధవారం నుంచి నిర్వహిస్తున్న సన్నాహక కార్యక్రమం గురు వారం ఘనంగా ముగిసింది.
స్థానిక అరవిందనగర్ సర్వేశ్వ రాలయంలో నిర్వహిస్తున్న అయ్యప్ప స్వామి మండల పూజలో భాగంగా గురువారం పడిపూజను భక్తిశ్రద్ధలతో ని ర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పడిపై వినా యకు, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి చిత్రపటాలను విశేషంగా అలంకరించి పూజలు చేశారు.
సాయినగర్లోని అంబేడ్కర్ భవనలో బుధవారం సాయంత్రం ఐక్య క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐక్య క్రిస్మస్ వేడుకల చైర్మన వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్య క్రమంలో తొలుత కోయర్ బృందాలు క్రీస్తు భక్తి గీతా లాపనలతో అలరించారు. అనంతరం అంతర్జాతీయ దైవ ప్రసంగీకుడు రెవరెండ్ గాడ్లి హాజరై ఆధ్యాత్మిక సందేశమిచ్చారు.
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం ఆవరణలోని హరిహర సుత అయ్యప్పస్వామి దేవాలయం లో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి లక్షపుష్పార్చన కార్యక్రమాన్ని ఘనం గా నిర్వహించారు.
ధనుర్మాస ఉత్సవాలకు సోమవారం నగరంలోని పలు ఆలయాల్లో శ్రీకారం చుట్టారు. సోమవారంతో ప్రారంభ మైన ఈ ఉత్సవాలు జనవరి 13వ తేదీ వరకు కొన సాగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నగరంలో ని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రబద్ధంగా నిర్వహించారు.
దత్తజయంతిని ఆదివారం నగరంలోని దత్తమందిరాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పా తూరులోని దత్తాత్రేయ దేవస్థానంలో స్వామివారి మూలవిరాట్కు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని వేదికపై వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ దత్తాత్రేయ వ్రతం నిర్వహించారు. అన్నదాన విని యోగం చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తిని ఊరేగించారు.
ఆర్థికంగా బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. కొత్త పనులు చేపడతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించు కోవద్దు.
మార్గశిర శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం వేమన టెలిఫోన భవన ఎదురుగా ఉన్న షిర్డీ సాయిబాబా మందిరంలో పుష్పాభిషేకాన్ని వై భవంగా నిర్వహించారు. బాబా మూలవిరాట్ను విశేషంగా అలంకంకరిం చి, వివిధ రకాల పూలతో అభిషేకించారు.
గీతాజయంతిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పఠన పోటీలకు విశేష స్పందన లభించింది. ఆరు నుంచి 9వ తరగతి వరకు రెండు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి దాదాపు వందమంది విద్యార్థులు పాల్గొని భగవద్గీత పఠనం చేశారు.
పైసా ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే పదార్థాలతోనే పూజాసామాగ్రిని శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం ఎంతో సమయం పట్టదు. ఈ సారి రాగి, వెండి, ఇత్తడి సామాన్లను శుభ్రం చేసేందుకు ఈ టిప్స్ ట్రై చేసి చూడండి.