Ugadi: ఉగాది వచ్చేస్తోంది.. ఈ పనులు అసలు చేయకండి.. చేస్తే అంతే సంగతులు
ABN , Publish Date - Mar 26 , 2025 | 04:06 PM
Ugadi: ఉగాది అంటేనే తెలుగువారికి సెంటిమెంట్. ఈ రోజు ఏం చేస్తే.. ఏడాది అంతా అలాగే ఉంటుందని వారు నమ్ముతారు. అయితే ఉగాది పర్వదినం ముందు సైతం ఈ పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఓ వేళ ఈ తరహా పనులు చేస్తే.. ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని అంటున్నారు.

ఉగాది వచ్చేస్తోంది.. ఈ పనులు అసలు చేయకండి.. చేస్తే అంతే సంగతులు మరికొద్ది రోజుల్లో తెలుగు సంవత్సరాది ఉగాది రానుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఈ ఉగాది పర్వదినాన్ని సంప్రదాయ బద్దంగా జరుపుకుంటారు. అయితే ఉగాదికి ముందు ఈ పనులు చేయడం వల్ల దురదృష్టం వెంటాడుతోందని పెద్దలు ముందు చూపుతో హెచ్చరిస్తున్నారు.
ఉగాదికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేయడం మంచిది. కానీ,ఆ రోజు సాయంత్రం చీపురు పట్టి ఊడవ కూడదని చెబుతారు.దీని వెనుక బలమైన నమ్మకం ఉందని వివరిస్తున్నారు. అదేమిటంటే.. సాయంత్రం శుభ్రం చేయడం వల్ల ఇంట్లోకి వచ్చే సంపద బయటకు పోతుందని అంటున్నారు. అలాగే ఉగాది రోజును శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఆ ముందు రోజు రాత్రి గొడవలు, వాగ్వాదాలు చేయడం లాంటివి చేయకూడదని స్పష్టం చేస్తున్నారు.
ఇది కుటుంబంలో అశాంతిని తెస్తుందని, ఏడాది పొడవునా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఉగాదికి ముందు రోజు రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకు నగదు అప్పు ఇవ్వడం కూడా చేయకూడదని సూచిస్తున్నారు. ఈ పని నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని వివరిస్తున్నారు.
అదే విధంగా ఇంట్లోని పాత వస్తువులను ఉగాది ముందు రోజు తొలగించడం మంచిదే కానీ.. ఆ రోజు ఉదయం వాటిని విసిరేయడం లేదా కాల్చడం వంటివి చేయరాదని చెబుతున్నారు. ఇది ఇంటి సంపదను నాశనం చేసినట్లు భావిస్తారంటున్నారు. సాంప్రదాయ పండితులు చెప్పే మరో ముఖ్య విషయం ఏమిటంటే..ఉగాదికి ముందు రోజు మాంసాహారం తినడం లేదా మద్యం సేవించడం మానుకోవాలి.
ఇది శారీరక,మానసిక శుద్ధిని దెబ్ బతీస్తుందని, దీని వల్ల కొత్త సంవత్సరంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరిస్తారు. అలాగే ఉగాది రోజుకు ముందు జుట్టు కత్తిరించడం లేదా గోళ్లు కత్తిరించడం కూడా చేయరాదని పలువురు నమ్ముతారు.ఇది శుభ శక్తిని తగ్గిస్తుందని వారి పేర్కొంటున్నారు. ఉగాది పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకొని.. కొత్త సంవత్సరాన్ని ఆరంభించడం ప్రధాన ఉద్దేశ్యం.ఈ నేపథ్యంలో ఈ సూచనలు పాటిస్తే దురదృష్టం దూరమవుతుందని.. సుఖసంతోషాలు దరి చేరతాయని పెద్దలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి...
YSRCP Corruption: ఆఖరికి కుక్కల తిండినీ వదలలేదుగా..
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్