కనీస నిల్వ చార్జీలు తీసెయ్యాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:37 AM
బ్యాంకులను జాతీయం చేస్తే ప్రజల కోసం పనిచేస్తాయని, ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం వాటిని జాతీయం చేసింది. అప్పుడు ప్రజలందరూ...
బ్యాంకులను జాతీయం చేస్తే ప్రజల కోసం పనిచేస్తాయని, ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం వాటిని జాతీయం చేసింది. అప్పుడు ప్రజలందరూ ఆహ్వానించారు. సేవింగ్స్ అకౌంట్‌లో ఉన్న నగదుకు ఆ రోజుల్లో సంవత్సరానికి ఐదో పదో వడ్డీ కింద జమ అయ్యేది. ఇప్పుడు వడ్డీ కింద వచ్చే మొత్తం కన్నా వివిధ రకాల చార్జీల పేరుతో బ్యాంకులు తీసుకునే మొత్తం అధికంగా ఉంటోంది. నగదు తీయాలన్నా వేయాలన్నా కూడా చార్జీలు వేస్తున్నారు. అన్నిటికీ యంత్రాలు పెట్టేశారు. ఏదన్నా అడిగినా బ్యాంకు సిబ్బంది సరిగా సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు ఖాతాలో కనీస నిల్వ ఐదు వేల రూపాయలు ఉండాలంటున్నారు. లేకపోతే జరిమానా వేస్తారట. ఇది అన్ని రకాలుగా ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. అలాగే బ్యాంకులను కూడా ప్రైవేటుపరం చేసే విధంగా వ్యవహరిస్తోంది. ప్రజల డబ్బును బ్యాంకుల వాళ్ళు సేవింగ్స్ రూపంలో తీసుకుని ఖాతాదారులకు అతి తక్కువ వడ్డీ ఇచ్చి, అధిక వడ్డీలకి పెట్టుబడిదారులకు ఇస్తున్నారు. బ్యాంకు వాళ్లు ప్రజల సొమ్ము మీద మనుగడ సాగిస్తున్నారు. కాబట్టి కనీస నిల్వ లేకపోతే చార్జీలు విధించడాన్ని బ్యాంకులు మానుకోవాలి.
–నార్నె వెంకటసుబ్బయ్య
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు
Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News