Share News

World Book Day 2025: పుస్తకాల చెలిమి

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:56 AM

పుస్తకాలు మానవ జీవితంలో మిత్రులుగా, మార్గదర్శకులుగా మారతాయని ఈ కవిత హృద్యంగా చెబుతోంది. జ్ఞానాన్ని పంచే పుస్తకాల పఠనాన్ని అలవర్చుకోవాలని ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పాఠకులను ప్రేరేపిస్తోంది

World Book Day 2025: పుస్తకాల చెలిమి

మల్లెపూల వర్ణమాలల్ని అల్లుకొని

విజ్ఞాన సౌరభాల్ని విచ్చుకుంటున్న

పుస్తక పువ్వుల్ని తనివితీరా ఆస్వాదిద్దాం

పుస్తకం హస్తభూషణం కాదనీ

మస్తిష్కానికి నేస్తమనీ

కలాలు గర్జించే వరకూ కవిత్వ బలాలు

శాసించే వరకూ నిరంతరంగా... తరంతరంగా

పాటై పల్లవిద్దాం మాటై ముచ్చట పెడదాం

ఆటై అల్లరి చేద్దాం...

మనసున మనసై ఘూర్ణిల్లటానికి

మనిషిని మనిషిగా పూర్ణించటానికి

మంచి పుస్తకాల్ని మనువాడుదాం

మనలో అర్ధాంగి పుస్తకమే అందాం

విజ్ఞాన వికాసాల్ని పొత్తంగా కందాం

పాశ్చాత్య పోకడల్లో

చెదలు చెదలుగా రాలుతున్న మెదళ్ళనూ

బిజీ బిజీగా శ్వాసిస్తున్న గుండె గదులనూ

పుస్తక పఠనాలతో పూడ్చేద్దాం..

సెల్లుతో చిల్లుపడకుండా జ్ఞానాన్ని దర్శిద్దాం

మానసిక ఒత్తిళ్లను

చీకటి పొత్తిళ్లలో వొదిలేసి

రేపటి కలల కుచ్చిళ్లలో దాగిన

ఆనంద గ్రంథాల్ని పేజీలు పేజీలుగా తెరుద్దాం

– కటుకోఝ్వల రమేష్

(నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం)

Updated Date - Apr 23 , 2025 | 04:56 AM