Magnesium Deficiency: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా.. ఈ పండ్లు తింటే సమస్యకు చెక్
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:22 PM
మెగ్నీషియం లోపాన్ని దూరం చేసే ముఖ్యమైన పండ్లు కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తింటే సమస్య సులువుగా పరిష్కారమవుతుందని అంటున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: మనం ఆరోగ్యంగా ఉండేందుకు మెగ్నీషియం ఎంతో అవసరం. నాడీ కణాల పనితీరు, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచేందుకు, బీపీ నియంత్రణకు మెగ్నీషియం ఎంతో అవసరం. పురుషులకు రోజుకు 420 మిల్లీగ్రాముల మెగ్నీషియం స్త్రీలకు 310-400 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం. కానీ జనాభాలో దాదాపు సగం మంది మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారట. ఇలాంటి వారు కొన్ని పండ్లు తింటే సమస్య సులువుగా పరిష్కారం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఫిట్‌నెస్ మెరుగుపరిచేందుకు బొప్పాయి పండు అత్యుత్తమం. ఇందులో మెగ్నీషియంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలతో 34.6 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. గుండె జబ్బుల నివారణకు అవసరమైన లైకోపీన్ అనే రసాయనం ఇందులో పుష్కలంగా ఉంటుంది.
అత్తిపండ్లల్లో కూడా మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఒక కప్పు అత్తి పండ్ల ముక్కలు తింటే శరీరానికి అవసరమైన మెగ్నీషియంలో దాదాపు పావు శాతం లభిస్తుంది. ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువే. మనకు ఫైబర్‌లో 50 శాతం అత్తి పండ్ల ద్వారానే అందుతుంది.
Also Read: నవజాత శిశువుల గురించి మీకీ ఆసక్తికర విషయాలు తెలుసా
అరటి పండ్లలో కూడా మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. కప్పు అరటి పండ్ల ముక్కల్లో 40.6 శాతం మెగ్నీషియం ఉంటుంది. వీటిల్లో విటమిన్ బీ6తో పాటు జీవక్రియలను మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసే ఇతర పోషకాలు కూడా అనేకం ఉంటాయి. రోజుకు ఒక అరటి తిన్నా ఆరోగ్యంలో మేలి మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఒక కప్పు ఎండు ఖుబానీ పండ్ల ముక్కల్లో సుమారు 41.6 మిల్లీ గ్రాముల మెగ్నీషియం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో రూజువారి మెగ్నీషియం అవసరాల్లో 9.9 శాతం లభిస్తుంది. ఆక్సిజన్ సరఫరా, హార్మోన్ల తయారీకి అవసరమైన ఐరన్ కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తుంది.
Also Read: రాత్రుళ్లు సరిగా నిద్రపట్టట్లేదా.. అర్ధరాత్రి రెండింటికి మెళకవ వస్తోందా?
విటమిన్ సీకి జామపండు పెట్టింది పేరు. అయితే, ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. కప్పు జామ పండు ముక్కలతో 36.4 గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. దీంతో పాటు 4.21 గ్రాముల ప్రొటీన్, రోజు వారి అవసరమైన దానికంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ సీ కూడా దొరుకుతుంది.
ఈ పండ్లతో పాటు పాలకూర, పుచ్చకాయ గింజలు, చియా గింజలు, బ్రౌన్ రైస్, బాదం పప్పులు, సోయా మిల్క్ వంటి వాటిలో కూడా మెగ్నీషియం కావల్సినంత దొరుకుతుంది. కాబట్టి, మెగ్నీషియం లేమితో ఇబ్బంది పడుతున్న వారు వీటిని ట్రై చేయాలని నిపుణులు చెబుతున్నారు.