Share News

China India relations: మోదీ... మా దేశానికి రండి

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:31 AM

భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని చైనా ప్రతిష్టాత్మక షాంఘై సహకార సంస్థ(ఎ్‌ససీవో) నాయకత్వానికి భారత ప్రధాని మోదీని ఆహ్వానించింది. ఈ ఏడాది చైనాలో పర్యటించాలని మోదీని ఆహ్వానించిన చైనా, అమెరికాతో సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ మార్పు గమనార్హం.

China India relations: మోదీ... మా దేశానికి రండి

బీజింగ్‌, ఏప్రిల్‌ 20: అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ పొరుగు దేశం చైనా స్వరం మారుతోంది. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి డ్రాగన్‌ ఇప్పుడు స్నేహ హస్తం చాపుతోంది. భారత్‌, ఇతర సభ్య దేశాలతో కలసి షాంఘై సహకార సంస్థ(ఎ్‌ససీవో)కు నాయకత్వం వహించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఏడాది తమ దేశంలో పర్యటించాలని ప్రధాని మోదీని ఆహ్వానించింది. ప్రతీకార సుంకాలతో బీజింగ్‌, వాషింగ్టన్‌ మధ్య సంబంధాలు క్షీణిస్తున్న దశలో చైనా వైఖరిలో ఈ మార్పు రావడం గమనార్హం.

Updated Date - Apr 21 , 2025 | 04:31 AM