Share News

DHL Express: అమెరికా వినియోగదారులకు డీహెచ్‌ఎల్‌ షాక్‌

ABN , Publish Date - Apr 21 , 2025 | 05:01 AM

అమెరికా కస్టమ్స్‌ నిబంధనల మార్పుల కారణంగా డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ $800 కంటే ఎక్కువ విలువైన రవాణాను తాత్కాలికంగా నిలిపివేసింది. కొత్త నిబంధనల ప్రకారం కఠిన తనిఖీలు, పేపర్‌వర్క్‌ అవసరం ఉంటుంది.

DHL Express: అమెరికా వినియోగదారులకు డీహెచ్‌ఎల్‌ షాక్‌

బెర్లిన్‌, ఏప్రిల్‌ 20: జర్మనీకి చెందిన కొరియర్‌ సేవల దిగ్గజం డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌... అమెరికా వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. అమెరికా కస్టమ్స్‌ నిబంధనల్లో ఇటీవల తెచ్చిన మార్పుల నేపథ్యంలో ఆ దేశంలోని వినియోగదారులకు 800 డాలర్లకన్నా ఎక్కువ విలువైన సరుకు రవాణాను సోమవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. కొత్త నిబంధనలతో షిప్‌మెంట్ల క్లియరెన్స్‌కు ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంది. ఈ నిబంధనల మేరకు 800 డాలర్లకన్నా ఎక్కువ విలువైన అన్ని షిప్‌మెంట్లకు అధికారిక ప్రవేశ ప్రక్రియ అవసరం ఉంటుంది. తాజా విధానంలో మార్పులతో కస్టమ్స్‌ పేపర్‌ వర్క్‌తోపాటు కఠిన తనిఖీలు ఉంటాయి.

Updated Date - Apr 21 , 2025 | 05:12 AM