Share News

Earthquake: భూకంప బాధితులకు సహాయం చేయడంలో భారత్ ఫస్ట్

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:12 PM

మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపం నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. భారతదేశం అన్ని రకాల సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.

Earthquake: భూకంప బాధితులకు సహాయం చేయడంలో భారత్ ఫస్ట్
Earthquake

భూ ప్రళయం తెచ్చిన బీభత్సం నేపథ్యంలో థాయ్ లాండ్, మయన్మార్ లలో గుట్టలు గుట్టలుగా గంట గంటకీ శవాలు బయల్పడుతున్నాయి. మయన్మార్‌లో సైనిక పాలన ఉండటంతో ఎప్పుడూ లేని విధంగా ఆ దేశ సైనిక చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ అంతర్జాతీయ సహాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, మయన్మార్ సాయం అడగడానికి ముందే సహాయం అందించిన వారిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపత్తు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సహాయం చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. "మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపం నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. భారతదేశం అన్ని రకాల సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో, మా అధికారులను సిద్ధంగా ఉండాలని కోరింది. అలాగే మయన్మార్, థాయిలాండ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని MEAని కోరింది" అని ప్రధాని మోడీ ఇప్పటికే తన ప్రకటనలో తెలిపారు.

Earthquake 1.jpg


మయన్మార్‌కు సహాయం చేయడానికి భారత వైమానిక దళం తన హిండన్ వైమానిక స్థావరం నుండి టెంట్లు, దుప్పట్లు, నీటి శుద్ధి యంత్రాలు, ఇంకా అవసరమైన మందులు సహా 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపింది. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ కూడా మద్దతు ఇచ్చాయి. వాషింగ్టన్.. మయన్మార్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. "ఇది నిజంగా బాధాకరం, మేము సహాయం చేస్తాము" అని ఆయన విలేకరులతో అన్నారు. మరోవైపు, భూకంప ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రధానమంత్రి పేటోంగ్‌ టార్న్ షినవత్రా నేతృత్వంలోని థాయ్ ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. భారతీయ పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని థాయిలాండ్‌లోని భారత రాయబార కార్యాలయం నివేదించింది. కానీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Earthquake 2.jpg


ఇవి కూడా చదవండి:

ఒక్కరికే దిక్కు లేదంటే.. ఒకే వేదికపై ఇద్దర్ని పెళ్లాడిన వ్యక్తి

మూలన పెట్టిన కూలర్ బయటకు తీశారా.. తిరగకపోతే ఇలా చేయండి..

Updated Date - Mar 29 , 2025 | 05:33 PM