Share News

F-1 visa cancellation: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై న్యాయపోరాటం

ABN , Publish Date - Apr 21 , 2025 | 05:07 AM

ఎఫ్‌-1 విద్యార్థి వీసాల రద్దును వ్యతిరేకిస్తూ భారత, చైనా విద్యార్థులు ట్రంప్‌ ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలకు నిరసనగా అమెరికా వ్యాప్తంగా ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

F-1 visa cancellation: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై న్యాయపోరాటం

కోర్టు మెట్లెక్కిన భారత్‌, చైనా విద్యార్థులు

తమ స్టూడెంట్‌ వీసా రద్దును సవాలు చేస్తూ కేసులు

నిర్బంధాలు, బహిష్కరణలను తక్షణం నిలిపేయాలని వినతి

ట్రంప్‌ తీరుకు నిరసనగా మరోసారి రోడ్లపైకి అమెరికన్లు

అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ ర్యాలీలు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 20: అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వలసదారుల బహిష్కరణ అంశంతో పాటు విశ్వవిద్యాలయాలపై ఆయన వైఖరి పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు నిరసనల స్థాయిని దాటి కోర్టుల్లో కేసులు వేసే స్థాయికి చేరుకుంది. ఎఫ్‌-1 విద్యార్థి వీసాల రద్దుకు నిరసనగా అమెరికాలో భారత్‌, చైనా విద్యార్థులు చేతులు కలిపారు. ట్రంప్‌ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని ముగ్గురు భారతీయ విద్యార్థులు, ఇద్దరు చైనా విద్యార్థులు కోర్టులో సవాలు చేశారు. డీహెచ్‌ఎస్‌, ఇమిగ్రేషన్‌ అధికారులపై న్యూహాం్‌పషైర్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ ఎఫ్‌-1 హోదాను అధికారులు ఏకపక్షంగా రద్దు చేశారని, దీనివల్ల తమ భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోయిందని, వీసాలు రద్దు చేసేముందు ప్రభుత్వం తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని ఆరోపించారు. విద్యార్థి వీసాను చట్టవిరుద్ధంగా రద్దు చేయడం వల్ల నిర్బంధం, బహిష్కరణ ముప్పుతో పాటు ఓపీటీకి అనర్హులు కావడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.

gtf.jpg

తమతో పాటు విదేశీ విద్యార్థుల వీసాలన్నీ పునరుద్ధరించాలని, నిర్బంధాలు, బహిష్కరణలను తక్షణం నిలిపివేయాలని కోరారు. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకొని ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు.


కాగా, ట్రంప్‌ యంత్రాంగంపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ముగ్గురు భారతీయ విద్యార్థులు రివియర్‌ యూనివర్సిటీ (న్యూహాం్‌పషైర్‌)లో చదువుతున్నారు. వీరిలో లింఖిత్‌ బాబు గొర్రెల గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకొని మే 20 నుంచి మాస్టర్స్‌ డిగ్రీలో చేరాల్సి ఉంది. ఇక మణికంఠ పసుల, తనూజ్‌ కుమార్‌ గుమ్మడవెల్లిల మాస్టర్స్‌ డిగ్రీ పూర్తికావడానికి మరో సెమిస్టర్‌ మాత్రమే మిగిలి ఉంది. ఇదిలా ఉండగా, ట్రంప్‌ విధానాలను నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా ప్రజలు 15 రోజుల వ్యవధిలోనే మరోసారి రోడ్డెక్కారు. శనివారం వేలాది మంది నిరసనకారులు పలు నగరాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రతీకార సుంకాలు, వలసదారుల బహిష్కరణ, ఇమిగ్రేషన్‌, ఆర్థిక విధానాలు, ఫెడరల్‌ ఉద్యోగాల్లో కోతలు తదితర అంశాలపై ఆందోళనకారులు తీవ్రంగా మండిపడ్డారు. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వద్దకు ర్యాలీగా చేరుకున్న నిరసనకారులు ట్రంప్‌ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ‘సిగ్గుచేటు’ అంటూ నినాదాలు చేశారు.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 05:07 AM