Indo-UAE: ఇండియాకు యూఏఈ రంజాన్ గిఫ్ట్
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:48 PM
క్షమాభిక్ష పెట్టడమనేది న్యాయం, కరుణ ఇంకా భారతదేశంతో దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి యుఎఇ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుందని యూఏఈ ప్రకటించింది.

రంజాన్ పండుగ వేళ యూఏఈ ప్రభుత్వం భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగకు ముందు 500 మందికి పైగా భారతీయ ఖైదీలను విడుదల చేసింది, మరో 1,518 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 1,295 మంది ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేశారు. రంజాన్ పర్వదిన సమయాన తన దయార్థ హృదయాన్నిచూపించిన యూఏఈ.. భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ఖైదీలకు పెద్ద ఎత్తున ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది.అధికారిక ఉత్తర్వుల ప్రకారం, క్షమాభిక్ష మంజూరు చేయబడిన వారిలో, 500 మందికి పైగా భారతీయ ఖైదీలు ఉన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.
దుబాయ్‌లోని పలు కారాగారాల్లో నిర్బంధించబడిన వివిధ దేశాల వ్యక్తులకు ఈ క్షమాభిక్ష వర్తిస్తుంది. దుబాయ్ అటార్నీ జనరల్, ఛాన్సలర్ ఎస్సామ్ ఇస్సా అల్-హుమైదాన్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం శిక్ష అనుభవించిన వారికి కొత్త జీవితాన్ని అందించడానికి చేసిన అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. క్షమాభిక్ష తర్వాత, దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్, దుబాయ్ పోలీసులు సమన్వయంతో, ఖైదీల విడుదలకు చట్టపరమైన విధానాలను ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించారని దుబాయ్ అటార్నీ జనరల్ కూడా ధృవీకరించారు. క్షమాభిక్ష ముఖ్య ఉద్దేశ్యం.. బాధితులు కుటుంబాలతో తిరిగి కలవాలని, సమాజంలో తిరిగి మమేకం కావడానికి ఉద్దేశించిందన్నారు.
క్షమాభిక్ష పెట్టడమనేది న్యాయం, కరుణ ఇంకా భారతదేశంతో దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి యుఎఇ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుందని యూఏఈ అటార్నీ జనరల్ అన్నారు. రంజాన్ సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే వార్షిక సంప్రదాయాన్ని యుఎఇ కొనసాగిస్తోందని తెలిపారు. ఈ చర్య పవిత్ర రంజాన్ మాసం స్ఫూర్తికి అనుగుణంగా దయ, సయోధ్యకు శక్తివంతమైన చిహ్నంగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
సరిహద్దు సమస్య పరిష్కారానికి సిద్ధం
పాక్ ఆర్మీ చీఫ్‌పై తిరుగుబాటు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి