Share News

Life Style: ఈ చిట్కాలతో భార్య, భర్తల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి

ABN , Publish Date - Mar 24 , 2025 | 07:53 AM

భార్యభర్తల మధ్య చిన్నపాటి వివాదాలు వస్తుంటాయి. వైవాహిక జీవితంలో ఇవ్వన్నీ సాధారణమే. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా అవి క్షణాల్లోనే సమసిపోతాయి. భార్యభర్తల బంధానికి ఉన్న ప్రత్యేక లక్షణం అదే.

Life Style: ఈ చిట్కాలతో భార్య, భర్తల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి
Tips For Couples

బ్యాచిలర్ జీవితం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగానే బాధ్యతలు పెరుగుతాయి. అప్పటివరకు మన పద్ధతులు ఓ రకంగా ఉంటే.. పెళ్లి తర్వాత పద్ధతులు మార్చుకోవాల్సి ఉటుంది. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగానే ప్రతి మనిషిలో ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది. కొద్ది నెలల తర్వాత మొదట్లో ఉన్న ఉత్సాహం కనిపించదు.


భార్యభర్తల మధ్య చిన్నపాటి వివాదాలు వస్తుంటాయి. వైవాహిక జీవితంలో ఇవ్వన్నీ సాధారణమే. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా అవి క్షణాల్లోనే సమసిపోతాయి. భార్యభర్తల బంధానికి ఉన్న ప్రత్యేక లక్షణం అదే. చాలామంది పెళ్లైన కొత్తలో ఉన్న ఉత్సాహాన్ని జీవితాంతం కొనసాగించాలనే ఆలోచనతో ఉంటారు. ఇది సాధ్యం కాదని అనేవాళ్లు లేకపోలేదు. కానీ కొన్ని టిప్స్ ఫాలో కావడం ద్వారా భార్య, భర్తల బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా క్షణాల్లో పరిష్కరించుకోవచ్చు. ఇంతకీ అవేంటో ఓసారి చూద్దాం.


రోజుకు కొంత సమయం

రోజులో కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం ఒకరికొకరు కేటాయించుకోండి. మనస్సు విప్పి ఇద్దరూ మాట్లాడుకోండి. ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడుకోవడం ద్వారా ఒకరిపై మరొకరికి నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. రోజులో కొంత సమయం ఒకరికొకరు కేటాయించడం ద్వారా 30శాతం భార్యభర్తల బంధం బలపడుతుందట.


గౌరవం

ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉండాలి. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవాలి. మాట్లాడుకొనేటప్పుడు పాజిటివ్ థింకింగ్ అవసరం. నెగిటివ్ థింకింగ్ ఇద్దరి మధ్య వివాదాలకు దారి తీయవచ్చు. విమర్మలు చేసుకోవడం, ఒకరిపై మరొకరు అనుమానాలు పెంచుకోవడం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి.


బాధ్యతల విషయంలో

ఇంటి పనులు ఎవరో ఒకరు మాత్రమే చేయాలనే భావనను మనసులోంచి తొలగించాలి. ఇంటి పనులు, ఆర్థిక నిర్వహణను సమానంగా విభజించుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఇద్దరూ సమానమనే ఆలోచన ఉండాలి. ఒకరు పెద్ద, మరొకరు చిన్న అనే బేధాభిప్రాయాలను మనసులోంచి దూరం చేయాలి. ఒకరి ఆసక్తులను మరొకరు గౌరవించాలి. భాగస్వామి అలవాట్లను తెలుసుకుని, అవి మంచివైతే ప్రోత్సహించాలి.


సమస్యలు ఎదురైనప్పుడు

ఏదైనా సమస్య తలెత్తినప్పుడు భార్యాభర్తలిద్దరూ కూర్చుని సమస్య పరిష్కార మార్గాలను చర్చించాలి. సమస్యను దాచుకోవడం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. కమ్యూనికేషన్ బలంగా ఉంటే విడాకులకు జీవితంలో తావుండదు. సెలవుల సమయంలో కలిసి బయటకు వెళ్లడం, స్పెషల్ అకేషన్స్‌లో బహుమతులు, లేఖలు ఇవ్వడం వివాహ బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు తోడ్పడతాయి.

ఇవి కూడా చదవండి:

టెక్‌ వ్యూ : కన్సాలిడేషన్‌కు ఆస్కారం

ఫార్మా కింగ్‌ దివీస్‌ మురళి

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 24 , 2025 | 07:53 AM