Share News

Bryan Johnson: బ్రయాన్ జాన్సన్ ఓ మోసగాడు.. అస్సలు నమ్మొద్దు..

ABN , Publish Date - Mar 31 , 2025 | 06:15 PM

Bryan Johnson: కేరళకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్.. బ్రయాన్ జాన్సన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. బ్రయాన్ వైద్య రంగంలో మోసానికి పాల్పడ్డ ఎలిజబెత్ హోమ్స్, బెల్లె గిబ్సన్‌లాంటి వాడని అన్నారు.

Bryan Johnson: బ్రయాన్ జాన్సన్ ఓ మోసగాడు.. అస్సలు నమ్మొద్దు..
Bryan Johnson

టెక్ కంపెనీ అధినేత బ్రయాన్ జాన్సన్ ఎప్పటికీ నవ యవ్వనంగా ఉండేందుకు పరితపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ప్రతిరోజు భారీ సంఖ్యలో మెడిసిన్స్ తీసుకుంటూ ఉన్నాడు. అతడు వాడే కొన్ని రకాల మందుల్ని అమ్మకానికి కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలోనే కేరళకు చెందిన సిరియాక్ ఎబీ పిలిప్స్ అనే లివర్ డాక్టర్ బ్రయాన్ జాన్సన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్రయాన్ ఓ మోసగాడంటూ మండిపడ్డారు. అతడు ప్రమాదకరమైన మందుల్ని అమ్ముతున్నాడని ఆరోపించారు. బ్రయాన్ వైద్య రంగంలో మోసానికి పాల్పడ్డ ఎలిజబెత్ హోమ్స్, బెల్లె గిబ్సన్‌లాంటి వాడని అన్నారు. బ్లూ ప్రింట్ పేరుతో ప్రమాదకరమైన స్నేక్ ఆయిల్ అమ్ముతున్నాడని పేర్కొన్నారు.


సిరియాక్ ఎబీ పిలిప్స్ కామెంట్లపై బ్రయాన్ జాన్సన్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో పిలిప్స్ పోస్టుకు రిప్లై ఇచ్చాడు. ‘ సిరియాక్.. ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టారు?. నేను అమ్మే మెడిసిన్స్ ఎక్స్‌ట్రా వర్జిన్ ఆయిల్,ప్రొటీన్లు, గింజలతో తయారు చేయబడినవి’ అని అన్నాడు. దీనికి పిలిప్స్ స్పందించారు. ‘ ద్వేషం ఏమీ లేదు మిత్రమా.. నిజాలు మాట్లాడుతున్నాను అంతే. నువ్వు అమ్ముతున్న మెడిసిన్ వల్ల మనిషి జీవితం కాలం పెరుగుతుందన్న రుజువులు ఏవి?. ల్యాబులో టెస్టులు ఏమైనా జరిగాయా? ఎలుకలు, పందులు మీద పరిశోధనలు ఏమైనా చేశారా? వాటికి ఆధారాలు చూపించు’ అని రిప్లై ఇచ్చారు.


మరణం గుట్టు విప్పిన డాక్టర్

న్యూయార్క్‌కు చెందిన ఓ డాక్టర్ మరణం గుట్టు విప్పారు. చనిపోయిన మనుషుల్ని మళ్లీ తిరిగి బతికించవచ్చని అంటున్నారు. న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన శ్యామ్ పర్నియా అనే శాస్త్రవేత్త మరణం మనిషి జీవితానికి అంతం కాదని అంటున్నారు. మనిషి చనిపోయిన తర్వాత కొన్ని గంటలు, రోజుల తర్వాత సెల్స్ కుళ్లిపోతాయని, దాని బట్టి మెదడును భద్రపరచవచ్చని అన్నారు. ఎక్ష్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్షిజన్ మిషిన్లు, కొన్ని రకాల మందులతో చనిపోయిన వారిని తిరిగి బతికించవచ్చుని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

మరణం గుట్టు విప్పిన డాక్టర్.. చనిపోయిన వాళ్లను బతికించొచ్చట.

Credit Score: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే ఏమౌతుంది.. రికవరీకి ఎంత టైం పడుతుంది

Updated Date - Mar 31 , 2025 | 06:16 PM