రోజూ నైటీ ధరించమని వేధించిన భర్త.. భార్య ఇచ్చిన ట్విస్ట్ మైండ్ బ్లాంకే..
ABN , Publish Date - Mar 24 , 2025 | 06:29 PM
సాధారణంగా భార్యలు నైటీ వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే.. భర్తలు గొడవపడుతుంటారు. కానీ, ఈ సంఘటనలో మాత్రం భార్య నైటీ వేసుకోవాలని భర్త టార్చర్ పెట్టాడు. ఎంతలా అంటే ఆమె తీసుకున్ని నిర్ణయానికి భర్త షాక్ అయ్యాడు.

భార్యా భర్తల మధ్య గొడవలు రావటం సర్వసాధారణం. అది,ఇది అని కాకుండా.. ఏ పాయింట్ మీదైనా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కొత్తగా ఆడవాళ్ల నైటీల విషయంలోనూ గొడవలు జరుగుతున్నాయి. భార్య 24 గంటలు నైటీ వేసుకుని ఇంట్లో తిరుగుతోందని భర్తలు గొడవలు పడుతున్న సంఘటనలు దేశ వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. అంతేకాదు.. నైటీల మీద సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తున్నాయి. సాధారణంగా ఆడవాళ్లు నైటీలు వేసుకుంటే.. భర్తలు వద్దంటుంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో భర్త నైటీ వేసుకోమని భార్యను టార్చర్ చేశాడు. ఆ టార్చర్ భరించలేక ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. భర్త మీద కంప్లైంట్ చేసింది.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుజరాత్ అహ్మదాబాద్‌కు చెందిన 21 ఏళ్ల యువతికి 2023లో అదే ప్రాంతానికి చెందిన డాక్టర్‌తో పెళ్లయింది. వీరి పెళ్లి సౌదీ అరేబియాలో జరిగింది. కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత అహ్మదాబాద్, భానుపూర్‌లోని అత్తింటికి వచ్చేశారు. అత్తింటికి వచ్చాక భర్త అసలు రంగు బయటపడింది. ఆమెను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టేవాడు. అంతటితో ఆగకుండా.. ఆమె వేసుకునే బట్టల మీద ఆంక్షలు పెట్టాడు. ప్రతీ రోజూ నైటీ వేసుకోవాలని ఫోర్స్ చేసేవాడు. ఇది ఆమెకు నచ్చలేదు. అత్తామామలకు విషయం చెప్పింది. వాళ్లు అతడ్ని ఏమీ అనలేదు సరికదా.. సర్దుకుపొమ్మని ఆమెకు చెప్పారు.
అత్తామామలు కశ్మీర్ ట్రిప్‌కు వెళ్లినపుడు భర్తతో గొడవపడి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పుడు ఇరుకుటుంబాల వాళ్లు సర్థి చెప్పి ఆమెను భర్తతో కలిపారు. అయినా అతడిలో మార్పు రాలేదు. రోజు రోజుకు భర్త టార్చర్ పెరుగుతుండటంతో యువతి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. భర్తపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. ప్రతీ రోజూ నైటీ వేసుకోమని టార్చర్ పెట్టేవాడని.. తాను ఎప్పుడు నిద్రపోవాలో.. ఎప్పుడు నిద్రలేవాలో భర్తే డిసైడ్ చేసేవాడని కంప్లైంట్‌లో పేర్కొంది. భర్తపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వింత సంఘటన ప్రస్తుతం మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
IPL 2025: వైజాగ్‌లో వాతావరణం ఎలా ఉంది.. మ్యాచ్‌కు వర్షం అడ్డుపడుతుందా
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
Tiger Woods: ట్రంప్ మాజీ కోడలితో టైగర్ ఉడ్స్ ప్రేమాయణం