Share News

Jaundice Symptoms: కామెర్లకు నాటు మందు వద్దు

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:49 AM

కామెర్లు liver వ్యాధికి సంకేతం కావచ్చు, కానీ మూలకారణాన్ని వైద్య పరీక్షలతో గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. నాటు మందులకన్నా వైద్యుల సలహాతోనే చికిత్స తీసుకోవడం మంచిది, లేకపోతే కాలేయం మరింత దెబ్బతిని మార్పిడి అవసరమవుతుంది.

Jaundice Symptoms: కామెర్లకు నాటు మందు వద్దు

డాక్టర్‌! మా అబ్బాయికి 18 ఏళ్లు. కామెర్లు సోకాయి. పత్యం చేస్తూ, పసరు మందు తీసుకుంటే సరిపోతుందని బంధువులు అంటున్నారు. ఈ మందుతో ప్రయోజనం ఉంటుందా?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

కాలేయం జబ్బు పడిందనడానికి కామెర్లు ఒక సంకేతమనే విషయం అందరికీ తెలుసు. అయితే కామెర్లకు కారణమైన కాలేయ జబ్బుకు అసలు కారణాన్ని వైద్య సహాయంతో కనిపెట్టి, అందుకు తగిన చికిత్స తీసుకోవడం ఎంతో కీలకం అనే విషయం ఎవరికీ తెలియదు. మూలికా వైద్యాలు, ఇతరత్రా నాటు మందుల వల్ల కాలేయానికి మేలు కంటే హాని ఎక్కువ కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన లివర్‌ ఫెయిల్యూర్‌కూ దారి తీయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కాలేయ మార్పిడి అవసరం అవుతుంది. కాబట్టి కామెర్లు కనిపించినప్పుడు కాలేయ వ్యాధి మరింత ముదిరిపోకుండా ఉండడం కోసం వైద్యుల సలహాలను తీసుకోవాలి. ఆకలి మందగించడం, పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించడం, మత్తుగా ఉండడం, బరువు కోల్పోవడం, కాళ్ల వాపు లాంటి లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించి, వైద్య పరీక్షలతో వ్యాధి మూల కారణాన్ని నిర్థారించుకోవాలి. ఆలస్యం చేయడం వల్ల కాలేయం మరింత దెబ్బతిని, సిర్రోసిస్‌ లేదా కాలేయ క్యాన్సర్‌లకు గురి కాక తప్పదు. పత్యం విషయానికొస్తే, కామెర్లు సోకినప్పుడు కాలేయం మీద భారం పడే మాంసాహారం మానేయాలి. ఎక్కువ నూనెలు, మసాలాలు లేకుండా వండిన సాత్వికాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మద్యపానం మానుకుని, మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటూ హెపటైటిస్‌ పరీక్షలు క్రమం తప్పక చేయించుకుంటూ ఉండాలి.

డాక్టర్‌ నవీన్‌ పోలవరపు,

లివర్‌ స్పెషలిస్ట్‌, హైదరాబాద్‌.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్

BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

Updated Date - Apr 17 , 2025 | 03:49 AM