పాత వాటికి కొత్త కళ
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:52 AM
ఎప్పటికీ కొత్త కొత్త ఫ్యాషన్ పోకడలు పుట్టుకొస్తూనే ఉంటాయి. దాంతో పాత దుస్తులను బీరువాలకే పరిమితం చేసేస్తూ ఉంటాం. కానీ పాతబడిపోయిన పట్టు చీరలు,..
సెలెబ్ టాక్
ఎప్పటికీ కొత్త కొత్త ఫ్యాషన్ పోకడలు పుట్టుకొస్తూనే ఉంటాయి. దాంతో పాత దుస్తులను బీరువాలకే పరిమితం చేసేస్తూ ఉంటాం. కానీ పాతబడిపోయిన పట్టు చీరలు, కుర్తాలకు కొత్త రూపాన్ని ఎందుకు ఇవ్వకూడదు? అని ప్రశ్నిస్తోంది బాలీవుడ్ తార, రచయిత్రి, ఇంటీరియర్ డెకార్ ఔత్సాహికవేత్త, ట్వింకిల్ ఖన్నా! పాత వస్త్రాలకు కొత్త హంగులు జోడిస్తూ, వాటికి ఇంటి అలంకరణలో చోటు కల్పిస్తున్న ట్వింకిల్ ఇంకా ఏమంటోందో తెలుసుకుందాం!
‘‘ఇంటికి పండుగ శోభ తీసుకురావడం కోసం అలంకరణ వస్తువుల మీద డబ్బును వృథా చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. దుకాణంలో కొనే ఖరీదైన అలంకరణ వస్తువులకు బదులుగా, ఇంట్లో ఉపయోగించకుండా భద్రపరిచిన వస్త్రాలను పునర్వినియోగించుకునే మార్గాల మీద దృష్టి పెట్టండి. పాత చీరలు, కుర్తాలు, దుపట్టాలతో ఒక గ్యాలరీని రూపొందించుకోండి. మన ఇంట్లో గోడలకు పెయింటింగ్‌లు, ఫొటోలను వేలాడదీస్తూ ఉంటాం. ఆకట్టుకునే వాల్ హ్యాంగింగ్స్‌ను తగిలిస్తూ ఉంటాం. ఇవన్నీ అందరి ఇళ్లలో ఉండేవే! కానీ వినూత్నంగా కనిపించడం కోసం కొంత సృజనాత్మకంగా ఆలోచించాలి.

పాత జ్ఞాపకాలు పదిలంగా...
మన పెళ్లి నాటి పట్టుచీరలు, బహుమతులుగా అందుకున్న పట్టు కుర్తాలు, సెక్విన్ వర్క్‌తో కూడిన లెహంగాలు, దుపట్టాలు లాంటివి మన బీరువాల్లో ఏళ్ల తరబడి మగ్గుతూ ఉంటాయి. పాతబడేకొద్దీ అవన్నీ పిగిలిపోయి, వాడుకోడానికి వీల్లేకుండా పాడైపోతూ ఉంటాయి. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఆ వస్త్రాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి వాటిని పారేయలేం. అలాగని వాడుకోలేం! ఇలాంటి మీమాంసకు చెక్ పెట్టి, వాటితో ఆకర్షణీయమైన వాల్ డెకార్ తయారు చేసుకోండి.
అంతులేనన్ని ప్రత్యామ్నాయాలు
పాత చీరలు, స్కార్ఫ్‌లు, కుషన్ కవర్లు, పాత దుపట్టాలను బయటకు తీసి, వాటికి మన పాత ఆర్ట్‌వర్క్స్ జోడించి కొత్త రూపాన్ని అందించాలి. అలాగే పాత వస్త్రాలను లెక్కలేనన్ని అవసరాలకు కూడా వాడుకోవచ్చు. వాటితో కుషన్ కవర్లు కుట్టుకోవచ్చు. టేబుల్ రన్నర్స్, ల్యాంప్‌షేడ్స్, కర్టెన్లు తయారుచేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్రాయిడరీలను జోడించి, ఫ్రేమ్ కట్టించి గోడలకు తగిలించుకోవచ్చు. ఇలా పాత వస్త్రాలు, దుస్తులకు కొత్త కళను జోడించి వాడుకోవడం వల్ల పాత జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవచ్చు. అలాగే దాంతోపాటు, ఇంటి అలంకరణ కూడా వినూత్నంగా మార్చుకోవచ్చు. మీరూ ప్రయత్నించి చూడండి.’’
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News