Share News

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌

ABN , Publish Date - Feb 17 , 2025 | 04:03 AM

జనవరి 22న, ‘‘979 పోస్టులతో’’ యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌- 2025 విడుదలైంది. అయితే గత ఏడాది (2024లో) వెయ్యికి పైగా పోస్టులుండగా, అంతకుముందు సంవత్సరం (2023లో) 1100లకు పైగా పోస్టులున్నాయి....

యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌

జనవరి 22న, ‘‘979 పోస్టులతో’’ యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌- 2025 విడుదలైంది. అయితే గత ఏడాది (2024లో) వెయ్యికి పైగా పోస్టులుండగా, అంతకుముందు సంవత్సరం (2023లో) 1100లకు పైగా పోస్టులున్నాయి. అయితే మొత్తం భర్తీ చేసే సర్వీసులను ఈ సారి 23కు పెంచడం జరిగింది (గత ఏడాది 21 సర్వీసులతో నోటిఫికేషన్‌ ఇచ్చారు). ఈసారి ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (IRMS)ను విభజించి, ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌, ఇండియన్‌ రైల్వే అకౌంట్స్‌ సర్వీస్‌-ఇండియన్‌ రైల్వే పర్సనల్‌ సర్వీ్‌సలుగా చేయడంతో ఈసారి భర్తీ చేసే సర్వీస్‌ల సంఖ్య 23కు పెరిగింది.


తాజా నోటిఫికేషన్‌లో మార్పులు

  • సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌కు కనీస విద్యార్హత అయిన గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలకు హాజరుకావచ్చు. గతంలో వీరు కేవలం ప్రిలిమినరీ వరకు మాత్రమే అవకాశం ఉండేది, మెయిన్స్‌ పరీక్షలకు హాజరు కావాలంటే మాత్రం గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికేట్‌ సమర్పించాలి. ప్రస్తుతం ఇంటర్వ్యూకి ముందు నిర్థేశిత గడువులోగా ఉత్తీర్ణత సర్టిఫికేట్‌ సమర్పిస్తే చాలు.

  • రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపులు కోరుతున్న అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ప్రిలిమినరీ అప్లికేషన్‌లోనే సమర్పించాలి. గతంలో ఈ నియమం ప్రిలిమ్స్‌ దశలో లేదు.

  • ఆదేవిధంగా OBC లు కుల దృవీకరణ పత్రంతో పాటుగా, నాన్‌ క్రిమీలేయర్‌ సర్టిఫికెట్‌ను కూడా దాఖలు చేయాలి. నాన్‌ క్రిమీలేయర్‌ సర్టిఫికెట్‌ గడచిన మూడు ఆర్థిక సంవత్సరాలు(2021-22, 2022-23, 2023-245) సంబంధించినదై ఉండాలి ౖఆఇ సర్టిఫికేట్‌ 01-04-2024 మరియు 11-02-2025 మధ్య జారీ అయినదై వుండాలి .

  • ఉగిఖి రిజర్వేషన్‌కు అర్హులైనవారు కూడా, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, నిర్ణీత అధికారిచే 01-04-2024 మరియు 11-02-2025 మధ్యకాలంలో కేంద్రప్రభుత్వ క్రైటీరియా ప్రకారం జారీ చేయబడిన ఇన్‌ కమ్‌ అండ్‌ అసెట్‌ సర్టిఫికెట్‌ను ప్రిలిమినరీ అప్లికేషన్‌ దశలోనే సమర్పించాల్సి వుంటుంది.

  • ఈసారి ‘‘సర్వీస్‌ ప్రిఫరెన్స్‌’’లను కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్‌ అప్లికేషన్‌లోనే ఎంచుకోవాల్సి ఉంది. అదేవిధంగా ‘‘క్యాడర్‌ ప్రిఫరెన్స్‌’’లను ప్రిలిమ్స్‌ పరీక్ష అయిన 10 రోజుల తరువాత సమర్పించాలి.

  • UPSC పరీక్షకు వన్‌ టైమ్‌ రిజిస్ర్టేషన్‌ అనేది తప్పనిసరి. తొలిసారిగా పరీక్షకు హాజరయ్యేవారు ముందుగా ్ఖ్కఖిఇ వెబ్‌సైట్‌లో వన్‌ టైమ్‌ రిజిస్ర్టేషన్‌ను చేసుకోవాలి. ఈ వన్‌టైమ్‌ రిజిస్ర్టేషన్లో సమర్పించిన వివరాలను (డేట్‌ ఆఫ్‌ బర్త్‌ మినహా), సమర్పించిన తేదీ నుండి 2025 ఫిబ్రవరి 25 లోపుగా ఎప్పుడైనా సవరించుకోవచ్చు.


ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ (ప్రిలిమ్స్‌): ఇది మొదటి దశ, ఇందులో రెండు ఆబ్జెక్టివ్‌ తరహా పేపర్లు ఉంటాయి.

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1: ఇందులో హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కరెంట్‌ అఫైర్స్‌ జనరల్‌ నాలెడ్జ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

సివిల్‌ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీశాట్‌) పేపర్‌ 2: పేపర్‌-2లో కాంప్రహెన్షన్‌, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌, లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ అనలిటికల్‌ ఎబిలిటీ, డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి(ఒక్కో పేపర్‌ 200 మార్కులకి ఉంటుంది).

  • CSAT కేవలం క్వాలిఫైంగ్‌ పేపర్‌ మాత్రమే. దీనిలో తప్పనిసరిగా 200 మార్కులకి 33ు/66 మార్కులు రావాలి.

  • పేపర్‌ 1 మాత్రం కట్‌ ఆఫ్‌ మార్కులు ఉంటాయి. ప్రతిసంవత్సరం కట్‌ ఆఫ్‌ మార్కు మారుతూ ఉంటుంది.


మెయిన్స్‌: రాత పరీక్ష. ఇందులో తొమ్మిది పేపర్లు ఉంటాయి. ఇవి అభ్యర్థి పరిజ్ఞానాన్ని, లోతుగా పరీక్షిస్తాయి. నిజ జీవిత సంఘటనలను అభ్యర్థులు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నారో అంచనా వేస్తాయి.

తప్పనిసరి పేపర్లు: పేపర్‌ ఏ(ఇండియన్‌ లాంగ్వేజ్‌), పేపర్‌ బి(ఇంగ్లిష్‌) ఈ రెండు పేపర్లు ఒక్కో పేపర్‌కి 300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో తప్పనిసరిగ్గా 75 మార్కులు సాధించాలి.

పేపర్‌ 1: జనరల్‌ ఎస్సే పేపర్‌ 2: జనరల్‌ స్టడీస్‌-1

పేపర్‌ 3: జనరల్‌ స్టడీస్‌-2 పేపర్‌ 4: జనరల్‌ స్టడీస్‌-3

పేపర్‌ 5: జనరల్‌ స్టడీస్‌-4 పేపర్‌ 6: ఆప్షనల్‌ పేపర్‌ -1

పేపర్‌ 7: ఆప్షనల్‌ పేపర్‌-2 (ఒక్కో పేపర్‌ 250 మార్కులు)

పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ): అభ్యర్థుల వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, వారి పరిపాలన సామర్థ్యాన్ని అంచనా వేస్తారు(దీనికి 275 మార్కులు).

అర్హతలు:

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి(కేటగిరీలను అనుసరించి సడలింపు ఉంటుంది).

విద్యార్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ

ఎన్నిసార్లు రాయవచ్చు: అభ్యర్థులు తమ కేటగిరీని బట్టి (జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు-6 సార్లు, ఓబీసీ-9 సార్లు, ఎస్సీ/ ఎస్టీ-అపరిమితం) పరిమిత సంఖ్యలో రాయవచ్చు.

ఆప్షనల్‌ సబ్జెక్టులు(మెయిన్స్‌కి మాత్రమే): నోటిఫికేషన్‌లోని జాబితా నుంచి ఒక ఆప్షనల్‌ సబ్జెక్టును ఎంచుకోవాలి.

పరీక్ష షెడ్యూలు: ప్రతి ఏడాది ఫిబ్రవరి/మార్చిలో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ప్రిలిమినరీ పరీక్ష మే/జూన్‌లో, మెయిన్స్‌ సెప్టెంబర్‌/అక్టోబర్‌లో, ఇంటర్వ్యూను మరుసటి సంవత్సరం ఫిబ్రవరి/మార్చిలో నిర్వహిస్తారు.

ప్రిపరేషన్‌: సిలబస్‌ చాలా విస్తృతంగా ఉంటుంది, పరీక్ష సంక్లిష్టత కారణంగా చాలా మంది అభ్యర్థులు ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ప్రిపేర్‌ అవుతారు. చాలామంది కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, స్టడీ మెటీరియల్‌, ఆన్‌లైన్‌ రిసోర్సెస్‌, కరెంట్‌ అఫైర్స్‌ అప్‌డేట్స్‌పై ఆధారపడతారు.

  • ప్రిపరేషన్‌లో నిరంతరం చదవడం, రైటింగ్‌ ప్రాక్టీస్‌, ప్రాక్టీస్‌ ఎగ్జామ్స్‌ రాయాలి.

  • సంక్షిప్తంగా, యుపీఎస్సీ సీఎ్‌సఈ అనేది భారతదేశంలోని పరిపాలనా వ్యవస్థలో ఉన్నతమైన పదవులకు అత్యంత సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసే సవాలుతో కూడిన పరీక్ష. దీనికి క్రమశిక్షణ, అంకితభావం, విభిన్న అంశాలపై సమగ్ర అవగాహన అవసరం.


స్టడీ మెటీరియల్‌: మార్కెట్‌లో రకరకాల స్టడీ మెటీరియల్స్‌ ఉన్నాయి. ఇందులో ఆన్‌లైన్‌ మెటీరియల్స్‌, కోచింగ్‌లు అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎంపిక చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరీక్ష విధానం:

భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో యూపీఎస్సీ సీఎస్‌ఈ ఒకటి. ఇండియన్‌ అడ్మినిస్ర్టేటివ్‌ సర్వీస్‌(ఐఏఎస్‌), ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ (ఐపీఎస్‌), ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌(ఐఎ్‌ఫఎస్‌) మరియు ఇతర కేంద్రప్రభుత్వ సర్వీస్‌లకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి యూపీఎస్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

  • పరీక్ష విధానం: యూపీఎస్సీ సీఎ్‌సఈ పరీక్ష మూడు దశలలో జరుగుతుంది.

  • మొదటి దశ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌

  • రెండవ దశ: మెయిన్‌ ఎగ్జామినేషన్‌ (మెయిన్స్‌)

  • మూడో దశ: పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)

  • మెయిన్స్‌, ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఫైనల్‌ ర్యాంక్‌ లిస్ట్‌ను ఇస్తారు.


ఇవి కూడా చదవండి..

గోల్డ్‌ బాండ్లకు గుడ్‌బై..

ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు

మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2025 | 04:03 AM