Water Conservation: నీటి బొట్టును ఒడిసిపట్టి
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:55 AM
నీటి కోసం మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి, లక్మెన్ మేరీ నాంగ్‌ఖ్లావ్ 16 వేల చెట్లు నాటి, చెక్‌డ్యాంలు నిర్మించి గ్రామాన్ని మారుస్తున్నారు. ‘జల యోధురాలు’గా గుర్తింపు పొందిన ఆమె జాతీయ స్థాయిలో నీటి పరిరక్షణకు మార్గదర్శకంగా నిలిచారు.
నీటి కోసం మహిళలు పడుతున్న కష్టాన్ని తొలగించడానికి ఆమె చేసిన కృషి...
16 వేల చెట్లు, నాలుగు చెక్‌డ్యాంలు, ఆరు స్టోరేజి ట్యాంక్‌లతో ఆ గ్రామం రూపురేఖలను మార్చేసింది. ‘జల యోధురాలు’గా పేరుపొందిన మేఘాలయా టీచర్ లక్మెన్ మేరీ నాంగ్‌ఖ్లావ్... జాతీయ స్థాయిలోనూ తన నీటి పరిరక్షణ నమూనా గురించి వివరించి ప్రశంసలందుకున్నారు.
‘మాది అందమైన కొండలు, గుట్టలతో ప్రకృతి అందాలతో అలరారే మేఘాలయ రాష్ట్రంలోని క్యెర్దెమ్‌ఖ్లా గ్రామం. చుట్టూ సహజ వనరులున్నా మంచినీటికి నోచుకోని దుస్థితి మాది. ఊరికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని వాగుల్లో దొరికే నీరే మాకు జీవనాధారం. నెత్తిన, నడుము మీద బిందెలతో ఇళ్ళ నుంచి బయలుదేరే మహిళలు అక్కడ సర్వసాధారణమైన దృశ్యం. ఇరుకుగా, కఠినంగా, వంకర్లు తిరిగిన కొండ దారుల్లో రోజుకు కనీసం రెండుసార్లు రాకపోకలు సాగిస్తేనే వంటకు, తాగడానికి, ఇతర అవసరాలకు కావలసిన నీరు సమకూరుతుంది. అత్యంత తడిగా ఉండే ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన మౌసిన్రామ్‌కి మా ఊరు దగ్గర్లోనే ఉంది. కానీ విలక్షణమైన భౌగోళిక పరిస్థితులవల్ల, చెట్ల నరకివేత తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల మా ప్రాంతంలో కురిసిన వర్షం మైదాన ప్రాంతాల్లోకి చాలా త్వరగా ప్రవహిస్తుంది. నీటిని నిల్వ చేసే సదుపాయాలు లేకపోవడంతో నీటి కొరతను మా గ్రామం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎండాకాలంలో మహిళల దుస్థితి వర్ణనాతీతం. అనారోగ్యంతో ఉన్నా, గర్భంతో ఉన్నా నిత్యం మంచినీటి కోసం కొండలు ఎక్కి దిగాల్సిందే. ఈ కష్టాలు నాకూ కొత్తేం కాదు.
వారు స్పందించలేదు...
నేను పదిహేనేళ్ళుగా మా ఊర్లోనే అసిస్టెంట్ టీచర్‌గా పని చేస్తున్నాను. ఉదయం తొమ్మిది గంటలకల్లా బడిలో ఉండాలి. అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం, నీరు తెచ్చుకోవడం, వంట... ఇవన్నీ ఎనిమిదిన్నర లోగా పూర్తి చేసుకోవాలి. దీనికోసం పొద్దున్నే నీటి కోసం బయలుదేరేదాన్ని. వాగు లో కాలుష్యం లేనిచోట నీటి కోసం మహిళలు బారులు తీరి ఉంటారు. ఆ క్యూలో నిలబడి నా వంతు కోసం ఎదురుచూడాలి. అది నాకు చాలా కష్టం అనిపించింది. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే... అధికారులకు మా పరిస్థితి వివరిస్తూ లేఖలు రాశాను. స్పందన రాలేదు. టీచర్‌గా నన్ను గౌరవించే మా గ్రామంలో మహిళలందరూ నీటి కష్టాల గురించి నాతో మొరపెట్టుకొనేవారు. కానీ నేను బాధితురాలినే. ఇది మహిళల సమస్య. ఎలాగైనా దాన్ని మేమే పరిష్కరించుకోవాలనుకున్నాం. 2016లో జరిగిన ఎన్నికల్లో గ్రామ ఉపాధి మండలికి కార్యదర్శిగా గ్రామస్తులు నన్ను ఎన్నుకున్నారు. దాంతో అధికారులతో నేరుగా మాట్లాడే అవకాశం దొరికింది. గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకొనే వీలు కలిగింది.
నీటి కొరత, శ్రమ తగ్గాయి
జల సంరక్షణ కోసం ఉద్దేశించిన ‘జై శక్తి అభియాన్’ పథకానికి చెందిన అధికారులు, నిపుణులతో చర్చించాను. వర్షాకాలంలో సమృద్ధిగా వానలు కురిసినా... దాన్ని నిలబెట్టుకోకపోవడం వల్లే నీటి సమస్య తీవ్రం అయిందనీ, చెట్ల నరకివేత దీనికి ప్రధాన కారణమనీ వారు చెప్పారు. దాంతో... మా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రతి ఒక్కరినీ దానిలో భాగస్వాములుగా చేశాను. అదే సమయంలో... నీటి నిల్వ, నిర్వహణ కోసం వివిధ ప్రణాళికలను రూపొందించాను. పెద్దగా ప్రాధాన్యత లేని మారుమూల గ్రామాలకు ఎక్కువ నిధుల కేటాయింపు అంత సులువు కాదు. కానీ నా తాప్రతయం, చేపడుతున్న కార్యక్రమాలు అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆకర్షించాయి. నిధుల రాక మొదలయింది. క్రమంగా మా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ఇప్పటికి 16 వేలకు పైగా చెట్లు నాటాం. అయిదు వాటర్ స్టోరేజి ట్యాంకులను, నాలుగు చెక్‌డ్యామ్‌లను నిర్మించుకున్నాం. భూగర్భ జలాలను పెంపొందించడానికి ఆరు నీటి వనరులను పునరుద్ధరించాం. ఇప్పుడు వర్షపు నీరు వృధా పోవడం లేదు. వేసవి కాలంలో కూడా నీటికి కొరత ఉండడం లేదు. గ్రామంలోని నిర్దిష్ట ప్రదేశాల్లో కొళాయిలు ఏర్పాటు చేయడంతో... దూరం నుంచి నీరు మోసుకొచ్చే శ్రమ మహిళలకు తప్పింది.
ప్రకృతిని కాపాడుకోవాలి...
నా భర్త ఎజిల్సన్ నేను చేసే ప్రతి కార్యక్రమానికీ ఎంతో మద్దతిస్తారు. మాకు ఇద్దరు అమ్మాయిలు. వ్యక్తిగత స్థాయిలో నేను ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం... సామాజిక మార్పునకు దోహదపడడమే కాదు... నాకు గొప్ప గుర్తింపు కూడా తెచ్చిపెట్టింది. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల నుంచి పలు సత్కారాలు అందుకున్నాను. ‘జల యోధురాలు’, ‘మార్పునకు మార్గదర్శి’ అనే ప్రశంసలు లభించాయి. నిరుడు ఢిల్లీలో జరిగిన 8వ భారతీయ జల వారోత్సవాల్లో పాల్గొని, ప్రసంగించే అవకాశం దక్కింది. ఈ సందర్భంగా గ్రామాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను పరిష్కరించడానికి నేను ప్రతిపాదించిన ప్రణాళికలు జాతీయ స్థాయిలో ప్రముఖుల ప్రశంసలందుకున్నాయి. మేఘాలయాలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు మా గ్రామ నమూనాను అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయురాలుగా, గ్రామ ఉపాధిమండలి కార్యదర్శిగానే కాదు.... మహిళా స్వయంసహాయక బృందాలకు సాధికారత కల్పించడం కోసం శిక్షణ ఇచ్చి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారేందుకు సాయపడే గ్రామీణ సంస్థకు అధ్యక్షురాలుగానూ వ్యవహరిస్తున్నాను. వివిధ గ్రామాల్లోని పాఠశాలలను సందర్శించి, పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, నీటి సంరక్షణల ఆవశ్యకత గురించి చెబుతున్నాను. ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనది. దాన్ని కాపాడుకోవాలంటే... ప్రకృతిని కాపాడుకోవాలి. ఇది మా గ్రామానికే కాదు... ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వర్తించే వాస్తవం.’’
ఉదయం తొమ్మిదికల్లా బడిలో ఉండాలి. అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం, నీరు తెచ్చుకోవడం, వంట... ఇవన్నీ ఎనిమిదిన్నర లోగా పూర్తి చేసుకోవాలి. దీనికోసం పొద్దున్నే నీటి కోసం బయలుదేరేదాన్ని. వాగులో... కాలుష్యం లేనిచోట నీటి కోసం మహిళలు బారులు తీరి ఉంటారు. ఆ క్యూలో నిలబడి నా వంతు కోసం ఎదురుచూడాలి.

ఇవి కూడా చదవండి...