smallest pacemaker: బియ్యపు గింజ కన్నా చిన్న పేస్‌మేకర్
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:47 AM
అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు బియ్యపు గింజకంటే చిన్న పేస్‌మేకర్‌ను అభివృద్ధి చేశారు. చర్మం పై నుంచి కాంతి ఆధారంగా పనిచేసే ఈ పేస్‌మేకర్‌ను గుండె సమీపంలోకి సర్జరీ లేకుండానే ప్రవేశపెట్టవచ్చు.
ఒక బియ్యపు గింజ పరిణామం ఎంత ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. అంత కన్నా చిన్న పేస్‌మేకర్‌ను అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. దీని పరిణామం 0.46 మిల్లీమీటర్లు ఉంటుంది. కొన్ని క్లిష్టమైన గుండె సర్జరీలు చేసే సమయంలో పేస్‌మేకర్లను తాత్కాలికంగా ఉపయోగిస్తారు. ఆ తర్వాత వాటిని మళ్లీ బయటకు తీస్తారు. దీని వల్ల పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది. శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ పేస్‌మేకర్‌ను గుండె సమీపంలో అమర్చటానికి ఎటువంటి సర్జరీ అవసరం ఉండదు. సన్నని తీగ ద్వారా లోపలికి పంపుతారు. చర్మంపై నుంచి వచ్చే కాంతి ఆధారంగా ఇది పనిచేస్తుంది. జంతువులపై చేసిన పరిశోధనల్లో ఈ పేస్‌మేకర్ విజయవంతంగా పనిచేసింది.
ఇవి కూడా చదవండి...