Share News

Chinta Prabhakar: దుబాయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

ABN , Publish Date - Mar 23 , 2025 | 02:57 PM

దుబాయ్‌లో ఎన్నారైలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

Chinta Prabhakar: దుబాయ్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలంగాణలో కులమతాలకు అతీతంగా ప్రజలందరు సామరస్యపూర్వకంగా సన్నిహితంగా ఉండడం ఒక ప్రత్యేకత అని సంగారెడ్డి శాసన సభ్యుడు చింతా ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

రంజాన్, దసరా, క్రిస్మస్ పండుగ ఏదైనా అందరు కలిసి ఆస్వాదించడం తెలంగాణ ప్రజల ప్రత్యేకత అని అన్నారు. దుబాయి పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం సాయంత్రం కొందరు తెలంగాణ ప్రవాసీయులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తెలంగాణ ప్రవాసీ ప్రముఖుడు డాక్టర్ రఫీయోద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన విందులో చింతా ప్రభాకర్‌తో పాటు దుబాయి నగరంలోని కొందరు ప్రవాసీయులు పాల్గొన్నారు.


Also Read: తానా మహాసభలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఇక తెలుగు ప్రవాసీయులు ప్రతి రంజాన్ మాసంలో చేపట్టే ఇఫ్తార్ కార్యక్రమాలు ఆప్యాయత వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడడానికి దోహదపడుతున్నాయి. తెలంగాణ, ఏపీకి చెందిన ఎన్నారైలు ఈ విందుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన మతసామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని చాటుతున్నారు. సౌదీ అరేబియాలోని చమురు రంగానికి నెలవు అయిన ఈశాన్య ప్రాంతంలోని అల్ ఖోబర్, దమ్మాం, జుబేల్, రాస్ తణురా ప్రాంతాలలో ప్రసిద్ధి గాంచిన తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాట్స్’ ఇటీవల అల్ ఖోబర్ లో ఇఫ్తార్ విందు నిర్వహించింది. సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా సెంట్రల్’ ఆధ్వర్యంలో రియాధ్ నగరంలో జరిగిన ఇఫ్తార్‌ విందులో ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 02:59 PM