TDP Foundation Day Celebrations: బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 05:08 PM
బహ్రెయిన్‌లో టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానుల సమక్షంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు సభికులు నివాళులు అర్పించారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బహ్రెయిన్‌లో వైభవంగా జరిగాయి. టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు వేడుకల్లో పాల్గొని పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. 43 ఏళ్ళ పార్టీ ప్రస్థానంలో పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన నాయకులు, కార్యకర్తల గొప్పదనాన్ని స్మరించుకున్నారు.
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు అని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు ప్రశంసలు కురిపించారు. ఐటీతో పాటు వివిధ రంగాలలో తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు దక్కిందని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పి, తెలుగు వారికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఇచ్చిన పార్టీ టీడీపీ అని కొనియాడారు.
Also Read: దుబాయిలో రంజాన్ చివరి రోజు ప్రవాసాంధ్రుల ఇఫ్తార్
ఆడపడుచులకు అండగా నిలిచి, రైతన్నల కన్నీరు తుడిచి, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థం మార్చిన పార్టీ టీడీపీ అని వక్తలు ప్రశంసించారు. దేశంలో మరే రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు..ఆ తరువాత అని ప్రతి ఒక్కరు గుర్తించేలా ప్రజల జీవితాల్లో ఆ స్థాయి మార్పులు తెచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం అని వక్తలు కొనియాడారు.
Also Read: తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ కిట్‌ల పంపిణీ
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి అభిమానులు తక్కెళ్ళపాటి హరిబాబు, పీజే నాయుడు, సతీశ్ బోల్ల, రామ మోహన కొత్తపల్లి, అనిల్ కుమార్ ఆరే, చంద్రబాబు నాయుడు, సతీశ్ శెట్టి, అనిల్ పమిడి, వెంకట్ గుడిపాటి, ఇంతియాజ్ అహ్మద్, నాగార్జున, వంశీకృష్ణ చౌదరి, సందీప్ చౌదరి, పుల్లా రావు చౌదరి, భవాని శంకర్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి