Minister Lokesh: ఉత్తమ కార్యకర్తలకు మంత్రి లోకేష్ అభినందనలు
ABN, Publish Date - Mar 31 , 2025 | 04:03 PM
Minister Lokesh: యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్తలను అభినందించారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

యలమంచిలిలో ఉత్తమ కార్యకర్తల సమవేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్

జూన్ నుంచి మనం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచన

కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని హామీ

భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ కలసికట్టుగా ముందుకుసాగాలని పిలుపునిచ్చిన మంత్రి లోకేష్

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకే అగ్రతాంబూలం, ఆ తర్వాతే ఎవరైనా అని లోకేష్ స్పష్టం చేశారు.

ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో మూడుసార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నామని, గ్రామస్థాయి అధ్యక్షుడికి కూడా పొలిట్ బ్యూరోలో స్థానం లభించే పరిస్థితి రావాలన్న మంత్రి.

ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి లోకేష్ కార్యకర్తలను కోరారు.

ఉత్తమ కార్యకర్తలను మంత్రి లోకేష్ అభినందించారు.

సభ్యత్వం, మన టీడీపీ, భవిష్యత్తుకు గ్యారంటీ వంటి అంశాల్లో అవార్డు అందుకున్న ధర్మాల ఆదిరెడ్డి అనే కార్యకర్తను ప్రత్యేకంగా అభినందించారు.

పలు సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన కార్యకర్తలు.

యలమంచిలిలో మంత్రి లోకేష్‌తో నేతలు.
Updated at - Mar 31 , 2025 | 04:05 PM