Share News

అమోఘం.. అతని అరంగేట్రం!

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:05 AM

14 ఏళ్లకే ఐపీఎల్‌ అరంగేట్రం.. ఎవరూ కలలో కూడా ఊహించని నిజం. బిహార్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ ఈస్థాయికి ఎదుగుతాడని అతడి తండ్రి సంజీవ్‌ తప్ప ఎవరూ ఊహించలేదు. గొప్ప కోచింగ్‌ అకాడమీల్లో ప్రాక్టీస్‌ చేయలేక పోయినా...

అమోఘం.. అతని అరంగేట్రం!

న్యూఢిల్లీ: 14 ఏళ్లకే ఐపీఎల్‌ అరంగేట్రం.. ఎవరూ కలలో కూడా ఊహించని నిజం. బిహార్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ ఈస్థాయికి ఎదుగుతాడని అతడి తండ్రి సంజీవ్‌ తప్ప ఎవరూ ఊహించలేదు. గొప్ప కోచింగ్‌ అకాడమీల్లో ప్రాక్టీస్‌ చేయలేక పోయినా.. ఖరీదైన కిట్‌లు, బ్యాట్లు లేకపోయినా ఆటపై ఉన్న ప్రేమతోనే అతడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి గురువైన తండ్రి శిక్షణలోనే రాటుదేలాడు. 12 ఏళ్లకే రంజీల్లోకి అడుగుపెట్టి ప్రకంపనలు సృష్టించిన వైభవ్‌.. 13 ఏళ్లకే టీ20లు ఆడాడు. గతేడాది ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు అతడిని రూ. కోటికి కొనుగోలు చేసినప్పుడే వైభవ్‌ సత్తా ఏంటో తెలిసింది. ఇక, శనివారం లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్‌.. ఎదుర్కొన్న తొలిబంతినే సిక్స్‌గా మలచడం మేటి క్రికెటర్లను కూడా అబ్బుర పరచింది. ఆ మ్యాచ్‌లో 20 బంతులు ఆడిన వైభవ్‌.. 34 పరుగులు చేశాడు. అతడి టెక్నిక్‌ మరింత పదును తేలాల్సి ఉన్నా.. తనకంటే ఎక్కువ వయసు, అనుభవం ఉన్న బౌలర్లను బెరుకులేకుండా ఎదుర్కొన్న తీరు అందరితో ఔరా అనిపించింది. ఇక, వైభవ్‌ బ్యాట్‌ స్వింగ్‌ చేస్తున్న తీరు యువరాజ్‌ను గుర్తు చేస్తోందని ఇంగ్లండ్‌ క్రికెటర్‌ సామ్‌ బిల్లింగ్స్‌ ప్రశంసించాడు.

ఎనిమిదో తరగతి విద్యార్థి ఆటను చూసేందుకు ఉదయాన్నే నిద్రలేచా. ఐపీఎల్‌లో అద్భుత అరంగేట్రం.

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 21 , 2025 | 03:05 AM