మమ్మల్ని గుర్తించండి
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:42 AM
అఫ్ఘానిస్థాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టును అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) గుర్తించాలని ఆ దేశ క్రీడాకారిణులు కోరుతున్నారు. 2021లో అఫ్ఘాన్ పాలన...

ఫిఫాకు అఫ్ఘాన్ మహిళల
ఫుట్‌బాల్ జట్టు అభ్యర్థన
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టును అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) గుర్తించాలని ఆ దేశ క్రీడాకారిణులు కోరుతున్నారు. 2021లో అఫ్ఘాన్ పాలన తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ పోటీల నుంచి ఆ దేశ జట్టును తప్పించారు. తమకు మళ్లీ గుర్తింపు ఇవ్వాలని అఫ్ఘాన్ మహిళా జట్టు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో అందరూ తమకు మద్దతుగా నిలవాలని అభ్యర్థిస్తున్నారు. అఫ్ఘాన్ జట్టులోని చాలా మంది ప్లేయర్లు దేశం విడిచి విదేశాల్లో తలదాచుకొంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Kavya Maran: అయ్యో.. వావ్.. మ్యాచ్ సమయంలో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..