క్రికెటర్లు నగ్న చిత్రాలు పంపేవారు
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:02 AM
లింగ మార్పిడి చేయించుకున్న మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంత మంది క్రికెటర్లు తనకు వారి నగ్న చిత్రాలు పంపి వేధించేవారని...
న్యూఢిల్లీ: లింగ మార్పిడి చేయించుకున్న మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంత మంది క్రికెటర్లు తనకు వారి నగ్న చిత్రాలు పంపి వేధించేవారని పేర్కొంది. ఆర్యన్ బంగర్‌గా ఉన్న అతడు.. గతేడాది అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. అబ్బాయిగా ఉన్నప్పుడు అనయకు అండర్-19 స్థాయిలో ముషీర్, సర్ఫరాజ్, జైస్వాల్ తదితర ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ‘లింగ మార్పిడి చేయించుకున్నాక సహచర ఆటగాళ్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. వారు తరచూ నాకు నగ్న ఫొటోలు పంపి ఇబ్బందిపెట్టేవారు. ఒకతను అందరి ముందు నన్ను తిడుతూ.. ఎవరూ లేనప్పుడు నా ఫొటోలు అడిగేవాడు. ఒకసారి సీనియర్ క్రికెటర్‌కు నా ఇబ్బందికర పరిస్థితి గురించి చెబితే.. పద కారులో వెళ్దామని చెప్పి, నాతో పడుకోవాలనుందని అన్నాడు’ అని ప్రస్తుతం ఇంగ్లండ్‌లో చదువుకుంటున్న అనయ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
అనయ బంగర్