మూడో స్థానంలో అరవింద్
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:41 AM
గ్రాండ్ ప్రీ చెస్ ర్యాపిడ్ ఆరో రౌండ్ ముగిసేసరికి భారత గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం మూడో స్థానానికి దూసుకొచ్చాడు...
వార్సా: గ్రాండ్ ప్రీ చెస్ ర్యాపిడ్ ఆరో రౌండ్ ముగిసేసరికి భారత గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం మూడో స్థానానికి దూసుకొచ్చాడు. ఆదివారం జరిగిన నాలుగో గేమ్‌లో గెలిచిన అరవింద్ ఐదు, ఆరో రౌండ్‌లను డ్రా చేసుకున్నాడు. దాంతో ఏడు పాయింట్లతో అరవింద్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. మరో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మూడు రౌండ్లలో..రెండింటిలో పరాజయం పాలయ్యాడు. మరో రౌండ్‌ను డ్రాగా ముగించాడు. దాంతో ప్రజ్ఞానంద (5) ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..