వరల్డ్‌క్‌పనకు అర్జెంటీనా క్వాలిఫై
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:06 AM
డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనా.. 2026 ఫిఫా వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన దక్షిణ అమెరికా క్వాలిఫయర్స్‌లో మెస్సీ గైర్హాజరీలో అర్జెంటీనా 4-1తో బ్రెజిల్‌ను...

బ్రెజిల్‌పై 4-1తో గెలుపు
బ్యూనస్ ఎయిర్స్: డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనా.. 2026 ఫిఫా వరల్డ్‌క్‌పనకు అర్హత సాధించింది. బుధవారం జరిగిన దక్షిణ అమెరికా క్వాలిఫయర్స్‌లో మెస్సీ గైర్హాజరీలో అర్జెంటీనా 4-1తో బ్రెజిల్‌ను చిత్తు చేసింది. అయితే, ఈ మ్యాచ్ ఫలితం కంటే ముందే మెస్సీ సేన ప్రపంచక్‌పనకు అర్హత సాధించింది. బొలీవియా-ఉరుగ్వే మ్యాచ్ 0-0తో డ్రాగా ముగియడంతో అర్జెంటీనాకు లైన్ క్లియర్ అయింది. దీంతో బ్రెజిల్‌తో మ్యాచ్‌లో సమరోత్సాహంతో అర్జెంటీనా విరుచుకుపడింది. కాగా, 48 జట్లు పాల్గొననున్న ఫిఫా వరల్డ్‌క్‌పనకు అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యదేశాలుగా అర్హత సాధించాయి. జపాన్, ఇరాన్, న్యూజిలాండ్‌తోపాటు తాజాగా అర్జెంటీనా కూడా క్వాలిఫై అయింది.
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..