Share News

బాదేసిన బట్లర్‌ పడగొట్టిన ప్రసిద్ధ్‌

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:43 AM

బట్లర్‌ (54 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్‌) భారీ అర్ధ శతకంతోపాటు ప్రసిద్ధ్‌ కృష్ణ (4-0-41-4) బంతితో విజృంభించడంతో.. గుజరాత్‌ టైటాన్స్‌ మళ్లీ టాప్‌లేపింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో...

బాదేసిన బట్లర్‌ పడగొట్టిన ప్రసిద్ధ్‌

నేటి మ్యాచ్‌లు

పంజాబ్‌ X బెంగళూరు

వేదిక: చండీగఢ్‌, మ.3.30 నుంచి

ముంబై X చెన్నై

వేదిక: ముంబై, రా.7.30 నుంచి

మళ్లీ టాప్‌నకు గుజరాత్‌ ఫ 7 వికెట్లతో ఢిల్లీ చిత్తు

అహ్మదాబాద్‌: బట్లర్‌ (54 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్‌) భారీ అర్ధ శతకంతోపాటు ప్రసిద్ధ్‌ కృష్ణ (4-0-41-4) బంతితో విజృంభించడంతో.. గుజరాత్‌ టైటాన్స్‌ మళ్లీ టాప్‌లేపింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 203/8 స్కోరు చేసింది. అక్షర్‌ (39), అశుతోష్‌ శర్మ (37), స్టబ్స్‌ (31), కరుణ్‌ నాయర్‌ (31) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో గుజరాత్‌ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 204 పరుగులు చేసి గెలిచింది. సాయి సుదర్శన్‌ (36), రూథర్‌ఫోర్డ్‌ (43) అదరగొట్టారు. కుల్దీప్‌, ముకేశ్‌ చెరో వికెట్‌ దక్కించుకొన్నారు. మూడు పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్న బట్లర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

అలవోకగా..: ఛేదనలో బట్లర్‌ జోరుకు ఢిల్లీ బౌలింగ్‌ బేజారైంది. ఓపెనర్‌ గిల్‌ (7) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. కానీ, మరో ఓపెనర్‌ సుదర్శన్‌తో కలసి రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించిన బట్లర్‌.. రూథర్‌ఫోర్డ్‌తో కలసి మూడో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు బాటలో నిలిపాడు. కానీ, శతకం మాత్రం పూర్తి చేసుకోలేక పోయాడు. రూథర్‌ఫోర్డ్‌ను ముకేశ్‌ వెనక్కిపంపాడు. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. స్టార్క్‌ గత మ్యాచ్‌ తరహాలో మరోసారి మ్యాజిక్‌ చేస్తాడేమోనని భావించారు. కానీ, 6,4 బాదిన రాహుల్‌ తెవాటియా (11 నాటౌట్‌).. మరో 4 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు.


కట్టడి చేసిన బౌలర్లు..: ప్రధాన బ్యాటర్లకు శుభారంభాలు దక్కినా.. వాటిని భారీస్కోర్లుగా మలచలేకపోవడం ఢిల్లీని దెబ్బతీసింది. ప్రసిద్ధ్‌ కృష్ణతో పాటు మిగతా బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. ఢిల్లీ 203 పరుగులకు పరిమితమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్‌కు ఓపెనర్‌ అభిషేక్‌ పోరెల్‌ (18).. తొలి ఓవర్‌లోనే 16 పరుగులతో దూకుడైన ఆరంభాన్నిచ్చాడు. కానీ, ఆ తర్వాతి ఓవర్‌లోనే అర్షద్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం రాహుల్‌ (28).. ఓపెనర్‌గా వచ్చిన నాయర్‌తో కలసి రెండో వికెట్‌కు వేగంగా 35 పరుగులు జోడించాడు. అయితే, రాహుల్‌ను కృష్ణ ఎల్బీగా వెనక్కిపంపాడు. మరోవైపు నాయర్‌ కొన్ని అద్భుత షాట్లతో అలరించినా.. కృష్ణ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో ఢిల్లీ 9 ఓవర్లలో 93/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో అక్షర్‌, స్టబ్స్‌ నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించడంతో.. స్కోరు బోర్డు దూసుకెళ్లింది. అయితే, స్టబ్స్‌ను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. 17వ ఓవర్‌లో అక్షర్‌, నిగమ్‌ (0)ను కృష్ణ వరుస బంతుల్లో అవుట్‌ చేయడంతో.. డెత్‌ ఓవర్లలో ఢిల్లీ డీలాపడింది. అశుతోష్‌ చివరి వరకు క్రీజులో ఉన్నా.. గుజరాత్‌ బౌలర్లు భారీ షాట్లు ఆడకుండా అతడిని కట్టడి చేశారు.


స్కోరుబోర్డు

ఢిల్లీ: పోరెల్‌ (సి) సిరాజ్‌ (బి) అర్షద్‌ 18, కరుణ్‌ నాయర్‌ (సి) అర్షద్‌ (బి) ప్రసిద్ధ్‌ 31, రాహుల్‌ (ఎల్బీ) ప్రసిద్ధ్‌ 28, అక్షర్‌ (సి) బట్లర్‌ (బి) ప్రసిద్ధ్‌ 39, స్టబ్స్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) సిరాజ్‌ 31, అశుతోష్‌ (సి/సబ్‌) లోమ్రోర్‌ (బి) కిశోర్‌ 37, విప్రజ్‌ (సి) బట్లర్‌ (బి) ప్రసిద్ధ్‌ 0, ఫెరీరా (సి) కిశోర్‌ (బి) ఇషాంత్‌ 1, స్టార్క్‌ (నాటౌట్‌) 2, కుల్దీప్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 203/8; వికెట్ల పతనం: 1-23, 2-58, 3-93, 4-146, 5-173, 6-173, 7-191, 8-199; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-47-1, అర్షద్‌ 4-0-46-1, ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-41-4, రషీద్‌ 4-0-38-0, ఇషాంత్‌ 3-0-19-1, సాయి కిశోర్‌ 1-0-9-1.

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి) స్టబ్స్‌ (బి) కుల్దీప్‌ 36, గిల్‌ (రనౌట్‌) 7, బట్లర్‌ (నాటౌట్‌) 97, రూథర్‌ఫోర్డ్‌ (సి) స్టార్క్‌ (బి) ముకేశ్‌ 43, తెవాటియా (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 19.2 ఓవర్లలో 204/3; వికెట్ల పతనం: 1-14, 2-74, 3-193; బౌలింగ్‌: స్టార్క్‌ 3.2-0-49-0, ముకేశ్‌ 4-0-40-1, అక్షర్‌ 2-0-18-0, విప్రజ్‌ నిగమ్‌ 4-0-34-0, కుల్దీప్‌ 4-0-30-1, మోహిత్‌ 2-0-28-0.

1

ఐపీఎల్‌లో వేగంగా 200 సిక్స్‌ల మైలురాయిని చేరిన భారత ఆటగాడిగా రాహుల్‌ (129 ఇన్నింగ్స్‌). శాంసన్‌ (159 ఇన్నింగ్స్‌)ను రాహుల్‌ వెనక్కినెట్టాడు. ఓవరాల్‌గా క్రిస్‌ గేల్‌ (69 ఇన్నింగ్స్‌), రస్సెల్‌ (97 ఇన్నింగ్స్‌) టాప్‌లో ఉన్నారు.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 7 5 2 0 10 0.984

ఢిల్లీ 7 5 2 0 10 0.589

పంజాబ్‌ 7 5 2 0 10 0.308

లఖ్‌నవూ 8 5 3 0 10 0.088

బెంగళూరు 7 4 3 0 8 0.446

కోల్‌కతా 7 3 4 0 6 0.547

ముంబై 7 3 4 0 6 0.239

రాజస్థాన్‌ 8 2 6 0 4 -0.633

హైదరాబాద్‌ 7 2 5 0 4 -1.217

చెన్నై 7 2 5 0 4 -1.276

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2025 | 04:44 AM