ఢిల్లీ ‘సూపర్’
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:21 AM
ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరు.. ఈ సీజన్‌లో జరిగిన తొలి సూపర్ ఓవర్‌లో పైచేయి సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాటపట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన ఢిల్లీ...
నేటి మ్యాచ్
ముంబై X హైదరాబాద్
వేదిక : ముంబై, రా.7.30, నుంచి
రాణించిన రాహుల్, అభిషేక్, అక్షర్
రాజస్థాన్‌పై ఉత్కంఠ విజయం
న్యూఢిల్లీ: ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరు.. ఈ సీజన్‌లో జరిగిన తొలి సూపర్ ఓవర్‌లో పైచేయి సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ గెలుపు బాటపట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన ఢిల్లీ మళ్లీ టాప్‌కు చేరుకొంది. 188 పరుగుల వద్ద ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో.. మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో మొదట రాజస్థాన్ 11/2 స్కోరు చేయగా.. ఢిల్లీ 4 బంతుల్లోనే 13 పరుగులు చేసి గెలిచింది. స్టబ్స్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అంతకుముందు తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (49), కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), స్టబ్స్ (34 నాటౌట్) రాణించారు. ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 188/4తో స్కోరు సమం చేసింది. నితీశ్ రాణా (51), యశస్వి జైస్వాల్ (51) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. మ్యాచ్‌లో చివరి ఓవర్‌తో పాటు సూపర్ ఓవర్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన స్టార్క్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
అదరగొట్టిన ఓపెనర్లు: ఛేదనలో ఓపెనర్లు జైస్వాల్, శాంసన్ (31) రాజస్థాన్‌కు అదిరే ఆరంభాన్నిచ్చారు. పవర్‌ప్లేలో ఇద్దరూ పోటీపడి మరీ షాట్లు ఆడుతూ.. 34 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, గాయపడిన శాంసన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆరు ఓవర్లకు రాజస్థాన్ 63/0తో నిలిచింది. మధ్య ఓవర్లలో ఢిల్లీ స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులను కట్టడి చేశారు. ఈ క్రమంలో రియాన్ పరాగ్ (8)ను అక్షర్ బౌల్డ్ చేసి తొలి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాణాతో కలసి జైస్వాల్ స్కోరు బోర్డును నడిపించాడు. 12వ ఓవర్‌లో సింగిల్‌తో జైస్వాల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. జట్టు స్కోరు సెంచరీ మార్క్ దాటింది. అయితే, కుల్దీప్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన జైస్వాల్ క్యాచవుట్ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతుండడంతో రాణా ఎదురుదాడికి దిగాడు. అక్షర్ బౌలింగ్‌లో 6,4,4తో 16 పరుగులు రాబట్టిన రాణా.. కుల్దీప్ వేసిన 16వ ఓవర్‌లో 6,4 బాదాడు. దీంతో లక్ష్యం చివరి 5 ఓవర్లలో 45 రన్స్‌కు దిగివచ్చింది. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్న రాణాను స్టార్క్ ఎల్బీగా వెనక్కుపంపడంతో ఢిల్లీ మ్యాచ్‌లోకొచ్చింది. కానీ, జురెల్ (26), హెట్‌మయర్ (15 నాటౌట్) జాగ్రత్తగా ఆడుతూ గెలుపు బాటలో నిలిపారు. కాగా, చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సి ఉండగా.. స్టార్క్ 8 పరుగులే ఇవ్వడంతో స్కోరు సమమైంది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. సింగిల్ తీసిన జురెల్ రనౌటయ్యాడు.
అక్షర్ దూకుడు: రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. మందకొడి పిచ్‌పై 14 ఓవర్లకు ఢిల్లీ 106/4 స్కోరు మాత్రమే చేసింది. ఈ క్రమంలో 150 కూడా చేరుకోవడం కష్టమేననిపించింది. కానీ, చివరి ఓవర్లలో స్టబ్స్‌తో కలసి కెప్టెన్ అక్షర్ పటేల్ 19 బంతుల్లోనే 41 రన్స్ జోడించడంతో స్కోరు బోర్డు రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. ఆ తర్వాత అశుతోష్ శర్మ (15 నాటౌట్) జతగా స్టబ్స్ వేగంగా 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఢిల్లీ ఊహించని రీతిలో 180 పరుగుల మార్క్ దాటింది. వీరిద్దరి దెబ్బకు రాజస్థాన్ చివరి 5 ఓవర్లలో 77 రన్స్ సమర్పించుకొంది. అంతకుముందు పోరెల్, రాహుల్ మూడో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. అయితే, రాహుల్‌ను ఆర్చర్.. పోరెల్‌ను హసరంగ బోల్తా కొట్టించారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అక్షర్ ఎడాపెడా షాట్లతో స్కోరు బోర్డులో ఊపుతెచ్చాడు. హసరంగ బౌలింగ్‌లో అక్షర్ 4,4,6తో 19 పరుగులు పిండుకొన్నాడు. తీక్షణ బౌలింగ్‌లో 4,4,6 బాదిన అక్షర్ మరో భారీ షాట్ ఆడే క్రమంలో అవుటయ్యాడు. మెక్‌గుర్క్ (9), కరుణ్ నాయర్ (0) విఫలమయ్యారు.
స్కోరుబోర్డు
ఢిల్లీ: మెక్‌గుర్క్ (సి) జైస్వాల్ (బి) ఆర్చర్ 9, అభిషేక్ పోరెల్ (సి) పరాగ్ (బి) హసరంగ 49, కరుణ్ నాయర్ (రనౌట్) 0, రాహుల్ (సి) హెట్‌మయెర్ (బి) ఆర్చర్ 38, స్టబ్స్ (నాటౌట్) 34, అక్షర్ (సి) జురెల్ (బి) తీక్షణ 34, అశుతోష్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 188/5; వికెట్ల పతనం: 1-34, 2-34, 3-97, 4-105, 5-146; బౌలింగ్: ఆర్చర్ 4-0-32-2, తుషార్ 3-0-38-0, సందీప్ 4-0-33-0, తీక్షణ 4-0-40-1, హసరంగ 4-0-38-1, పరాగ్ 1-0-6-0.
రాజస్థాన్: జైస్వాల్ (సి) స్టార్క్ (బి) కుల్దీప్ 51, శాంసన్ (రిటైర్డ్ హర్ట్) 31, పరాగ్ (బి) అక్షర్ 8, నితీశ్ రాణా (ఎల్బీ) స్టార్క్ 51, జురెల్ (రనౌట్) 26, హెట్‌మయెర్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 188/4; వికెట్ల పతనం: 0-61 (రిటైర్డ్ హర్ట్), 1-76, 2-112, 3-161, 4-188; బౌలింగ్: స్టార్క్ 4-0-36-1, ముకేశ్ 3-0-31-0, మోహిత్ 4-0-38-0, విప్రాజ్ 1-0-13-0, అక్షర్ 3-0-23-1, కుల్దీప్ 4-0-33-1, స్టబ్స్ 1-0-12-0.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
ఢిల్లీ 6 5 1 0 10 0.744
గుజరాత్ 6 4 2 0 8 1.081
బెంగళూరు 6 4 2 0 8 0.672
పంజాబ్ 6 4 2 0 8 0.172
లఖ్‌నవూ 7 4 3 0 8 0.086
కోల్‌కతా 7 3 4 0 6 0.547
ముంబై 6 2 4 0 4 0.104
రాజస్థాన్ 7 2 5 0 4 -0.714
హైదరాబాద్ 6 2 4 0 4 -1.245
చెన్నై 7 2 5 0 4 -1.276
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..