హిందీ కామెంట్రీ పేలవం!
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:45 AM
ఐపీఎల్‌లో హిందీ వ్యాఖ్యానంపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంజేశారు. మాజీ ఆటగాళ్లతో కూడిన హిందీ వ్యాఖ్యాతల ప్యానెల్ వారి స్థాయికి తగ్గట్టుగా మ్యాచ్‌లను విశ్లేషించలేకపోతున్నారని విమర్శలు...

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో హిందీ వ్యాఖ్యానంపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంజేశారు. మాజీ ఆటగాళ్లతో కూడిన హిందీ వ్యాఖ్యాతల ప్యానెల్ వారి స్థాయికి తగ్గట్టుగా మ్యాచ్‌లను విశ్లేషించలేకపోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో ఇంగ్లిష్ వ్యాఖ్యానం అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. హర్భజన్, సెహ్వాగ్, నవజోత్ సిద్ధూ, ధవన్, రైనా, ఊతప్ప, రాయుడు తదితరులతో కూడిన బృందం హిందీ వ్యాఖ్యానం చేస్తోంది. ప్రస్తుత హిందీ కామెంట్రీని 1990లలో దూరదర్శన్‌లో వచ్చే వ్యాఖ్యానంతో అభిమానులు పోల్చారు. కాగా..దీనిపైౖ హర్భజన్ స్పందిస్తూ.. వ్యాఖ్యానాన్ని మెరుగుపరుచుకుంటామన్నాడు.
ఇవి కూడా చదవండి..
Kavya Maran: అయ్యో.. వావ్.. మ్యాచ్ సమయంలో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..