Share News

Kavya Maran: అయ్యో.. వావ్.. మ్యాచ్ సమయంలో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే..

ABN , Publish Date - Mar 27 , 2025 | 08:08 PM

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఎప్పటిలా సన్‌రైజర్స్‌కు కళ్లు చెదిరే ఆరంభం దక్కలేదు. శార్దూల్ ఠాకూర్ చెలరేగడంతో హైదరాబాద్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.

Kavya Maran: అయ్యో.. వావ్.. మ్యాచ్ సమయంలో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే..
kavya maran

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రెండు బలమైన జట్లు తలపడుతున్నాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతోంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఎప్పటిలా సన్‌రైజర్స్‌కు కళ్లు చెదిరే ఆరంభం దక్కలేదు. శార్దూల్ ఠాకూర్ చెలరేగడంతో హైదరాబాద్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.


హైదరాబాద్ టీమ్ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరయ్యే ఆ జట్టు సీఈవో కావ్య మారన్ ఉప్పల్ స్టేడియంలో సందడి చేస్తోంది. వెంట వెంటనే రెండు వికెట్లు పడడంతో కావ్య దిగులుగా మారిపోయింది. ఏం జరుగుతోందనే ఆందోళన చెందింది. అయితే ఓపెనర్ ట్రావిస్ హెడ్ సిక్స్‌ల వర్షం కురిపిస్తుండడంతో కావ్య మళ్లీ సంతోషంగా మారిపోయి కేరింతలు కొడుతోంది. ఆమెను స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై చూపిస్తున్నప్పుడు మైదానంలోని ప్రేక్షకులు కూడా కేకలు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Virendra Sehwag: గిల్‌కు కెప్టెన్సీ చేయాలని లేదా.. గుజరాత్ కెప్టెన్‌పై సెహ్వాగ్ విమర్శలు


Riyan Parag: ఆ కుర్రాడికి రూ.10 వేలు ఇచ్చాడా.. రియాన్ పరాగ్ కాళ్లు మొక్కడంపై నెటిజన్లు కామెంట్లు ఏంటంటే


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2025 | 08:08 PM