ఉప్పల్‌లో దంచుడేనా?
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:15 AM
విధ్వంసకర బ్యాటర్లు, అనుభవజ్ఞులైన బౌలర్లతో బలంగా ఉన్న గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజా సీజన్‌ను విజయంతో ఆరంభించాలనుకొంటోంది...

మధ్యాహ్నం 3.30 నుంచి
ఫేవరెట్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ నేడు
హైదరాబాద్: విధ్వంసకర బ్యాటర్లు, అనుభవజ్ఞులైన బౌలర్లతో బలంగా ఉన్న గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజా సీజన్‌ను విజయంతో ఆరంభించాలనుకొంటోంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, ఇషాన్ కిషన్‌లాంటి పవర్ హిట్టర్లతో ప్రత్యర్థులను బెంబేలెత్తించే బ్యాటింగ్ లైనప్ ఉంది. గాయం నుంచి కోలుకొన్న ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌కు తుది జట్టులో చోటుదక్కే అవకాశాలున్నాయి. కెప్టెన్ కమిన్స్, షమి పేస్ భారాన్ని మోయనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జంపాకు చాన్స్ లభించవచ్చు. సన్‌రైజర్స్‌తో పోల్చితే రాజస్థాన్ కొంత బలహీనంగా కనిపిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ వేలికి గాయమైంది. దీంతో అతడి స్థానంలో పరాగ్ జట్టును నడిపించనున్నాడు.
ఇవి కూడా చదవండి..
IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే
IPL 2025: బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..