Yuzvendra Chahal-Dhanashree: ఛాహల్-ధనశ్రీ వర్మకు విడాకులు.. మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు..
ABN , Publish Date - Mar 20 , 2025 | 05:43 PM
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్, ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరు చేస్తూ ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల తప్పనిసరి విరామ వ్యవధిని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మకు విడాకులు మంజూరు చేస్తూ ముంబై ఫ్యామిలీ కోర్టు గురువారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల తప్పనిసరి విరామ వ్యవధిని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. మార్చి 20వ తేదీ లోపు విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు (Mumbai family) ముందు ఛాహల్, ధనశ్రీ గురువారం మధ్యాహ్నం హాజరయ్యారు (Chahal-Dhanashree Divorce).
హైకోర్టు తీర్పుతో యుజ్వేంద్ర ఛాహల్, ధనశ్రీ వర్మ విడాకుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కాగా, ధనశ్రీకి రూ.4.75 కోట్లను భరణంగా చెల్లించడానికి ఛాహల్ అంగీకరించినట్టు సమాచారం. అందులో ఇప్పటికే 2.37 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. కాగా, ఛాహల్, ధనశ్రీ 2020లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే గతేడాది వీరిద్దరి మధ్య విభేదాలు తెలెత్తినట్టు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ధనశ్రీ తన పేరు నుంచి ఛాహల్‌ను తొలగించడం విడాకుల వార్తలకు బలాన్ని చేకూర్చాయి. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ విడాకుల కోసం బాంద్రా ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో ఆర్జే మహ్వాష్‌తో కలిసి ఛాహల్ కనిపంచాడు. ఇద్దరూ సన్నిహితంగా కనిపించడంతో డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు షికారు చేశాయి. ఆ తర్వాత వీటిని మహ్వాష్ కొట్టిపారేసింది. తాము ఫ్రెండ్స్ మాత్రమేనని తెలిపింది. అయితే ఛాహల్ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు. అటు ధనశ్రీతో విడాకుల గురించి కానీ.. ఇటు మహ్వాష్‌తో రిలేషన్ గురించి గానీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఛాహల్ ప్రస్తుతం ఐపీఎల్-2025 కోసం సాధన చేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి