రీతికకు రజతం
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:47 AM
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షి్‌ప మహిళల విభాగంలో..తొలి రోజు భారత్ అదరగొట్టింది. గురువారం జరిగిన పోటీలలో మనోళ్లు ఓ రజతం, రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు...

ముస్కాన్, మాన్సీలకు కాంస్యాలు
ఆసియా రెజ్లింగ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షి్‌ప మహిళల విభాగంలో..తొలి రోజు భారత్ అదరగొట్టింది. గురువారం జరిగిన పోటీలలో మనోళ్లు ఓ రజతం, రెండు కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల 76 కిలోల విభాగంలో రీతికా హూడా రజతం, 59 కేజీల కేటగిరీలో ముస్కాన్, 68 కిలోల విభాగంలో మాన్సీ లాథర్ కాంస్యాలు దక్కించుకున్నారు. హోరాహోరీగా సాగిన 76 కిలోల ఫైనల్లో రీతిక 6-7తో కిర్గిస్థాన్ రెజ్లర్ అపేరి కిజీ చేతిలో పరాజయం చవిచూసింది. 59 కిలోల కాంస్య పోరులో ముస్కాన్ 4-0తో మంగోలియాకు చెందిన టొగ్టోఖ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. వరల్డ్ అండర్-17 చాంపియన్ మాన్సీ లాథర్ 68 కిలోల విభాగంలో.. 12-2తో కజూలినా (కజకిస్థాన్)ను చిత్తు చేసి కాంస్య పతకం అందుకుంది. మహిళల 55 కిలోల విభాగంలో మరో భారత రెజ్లర్ నిషు కాంస్య పతక పోరులో పరాజయం చవిచూసింది.
ఇవి కూడా చదవండి..
Kavya Maran: అయ్యో.. వావ్.. మ్యాచ్ సమయంలో కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..