Dhanashree-Ritika: ఛాహల్ మాజీ భార్యపై జర్నలిస్ట్ విమర్శ.. లైక్ కొట్టిన రోహిత్ భార్య రితిక
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:38 PM
విడాకుల నేపథ్యంలో భరణంగా ఛాహల్ నుంచి ధనశ్రీ రూ.4.75 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అటు ఛాహల్ గాని, ఇటు ధనశ్రీ గాని ఖండించలేదు. ఇలా రూ.4.75 కోట్లను భరణంగా తీసుకోవడంతో ధనశ్రీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర ఛాహల్, ధనశ్రీ వర్మ కొద్ది రోజుల క్రితం పరస్పర అంగీకారంతో విడిపోయిన సంగతి తెలిసిందే (Yuzvendra Chahal - Dhanashree Verma). ముంబైలోని బాంద్రా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే విడాకుల నేపథ్యంలో భరణంగా (Alimony) ఛాహల్ నుంచి ధనశ్రీ రూ.4.75 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అటు ఛాహల్ గాని, ఇటు ధనశ్రీ గాని ఖండించలేదు. ఇలా రూ.4.75 కోట్లను భరణంగా తీసుకోవడంతో ధనశ్రీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విడాకుల కోసం కోర్టుకు వచ్చినప్పుడు ఛాహల్ టీ-షర్టుపై.. బీ యువర్ ఓన్ షుగర్ డాడీ అనే క్యాప్షన్ ఉంది. ఆ క్యాప్షన్ ధనశ్రీని ఉద్దేశించిందే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా శుభాంకర్ మిశ్రా అనే జర్నలిస్ట్ ఈ భరణంపై ఓ పోస్ట్ చేశారు. ప్రేమ కోసం కాకుండా డబ్బు కోసమే ఛాహల్‌తో ధనశ్రీ బంధాన్ని కొనసాగించిందనే అర్థం వచ్చేలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్‌కు రోహిత్ శర్మ భార్య రితిక (Ritika) లైక్ కొట్టింది. ధనశ్రీని విమర్శిస్తూ చేసిన పోస్ట్‌ను రితికి లైక్ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ధనశ్రీపై వస్తున్న విమర్శలతో రితిక ఏకీభవిస్తోందని చాలా మంది భావిస్తున్నారు.
2020లో వివాహ బంధం ద్వారా ఒక్కటైన ఛాహల్, ధనశ్రీ 2022లోనే విడివిడిగా జీవిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకర్నొకరు అన్ ఫాలో చేసుకోవడం, ధనశ్రీ తన పేరు నుంచి ఛాహల్‌ను తొలగించడంతో విడాకులు వార్తలు మొదలయ్యాయి. ఆ వార్తలకు అనుగుణంగానే ఛాహల్, ధనశ్రీ విడాకుల కోసం ముంబై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 20వ తేదీన వారికి విడాకులు మంజూరు అయ్యాయి.
ఇవి కూడా చదవండి..
Vignesh puthur: విఘ్నేష్ పుత్తుర్.. ఆటో డ్రైవర్ కొడుకుతో ధోనీ ఏం మాట్లాడాడంటే..
MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..