అంతా పంత్ వల్లే..
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:09 AM
కెప్టెన్ రిషభ్ పంత్ నిర్లక్ష్యంవల్లే ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓడిపోయిందని టీమిండియా మాజీ ఓపెనర్...

లఖ్‌నవూ ఓటమిపై సెహ్వాగ్
న్యూఢిల్లీ : కెప్టెన్ రిషభ్ పంత్ నిర్లక్ష్యంవల్లే ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఓడిపోయిందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించాడు. ఇక..ఢిల్లీ విజయానికి చివరి ఆరు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన తరుణంలో..టెయిలెండర్ మోహిత్ శర్మను సునాయాసంగా స్టంపింగ్ చేసే అవకాశాన్ని పంత్ చేజార్చాడు. లేదంటే ఆ మ్యాచ్‌ను లఖ్‌నవూ గెలిచి ఉండేది. ‘మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్ల గురించి పంత్ ఆలోచించాలి. ఏ బౌలర్‌ను ఏ సమయంలో బౌలింగ్‌కు దించాలనే విషయాన్ని పంత్ మరిచాడు. మొత్తంగా మ్యాచ్‌పై పంత్ నియంత్రణ సాధించలేకపోయాడు’ అని సెహ్వాగ్ విశ్లేషించాడు.
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..