శరత్.. ఓటమితో వీడ్కోలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 03:58 AM
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ కెరీర్ ప్రస్థానం ముగిసింది. తాను చివరిసారిగా తలపడిన డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీలో శరత్ ఓటమి పాలయ్యాడు...

చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ కెరీర్ ప్రస్థానం ముగిసింది. తాను చివరిసారిగా తలపడిన డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీలో శరత్ ఓటమి పాలయ్యాడు. శనివారం ఇక్కడ జరిగిన సింగిల్స్ ప్రీక్వార్టర్‌ఫైనల్లో తెలుగు ఆటగాడు స్నేహిత్ 11-9, 11-8, 11-9తో శరత్‌పై గెలుపొందాడు. దీంతో 42 ఏళ్ల శరత్ కెరీర్ పరాజయంతో ముగిసినట్లయింది. ఈ టోర్నీనే తనకు ఆఖరిదని శరత్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఆటగాడిగా నా కథ ముగిసింది. ఇక..పరిపాలకునిగా, కోచ్‌గా, మెంటార్‌గా ఇలా.. ఏదైనా పాత్రలో ఒదిగిపోవాలనుకుంటున్నా’ అని శరత్ తన వీడ్కోలు ప్రసంగంలో వెల్లడించాడు. కాగా, ప్రీక్వార్టర్స్‌లో శరత్‌పై నెగ్గిన స్నేహిత్ క్వార్టర్స్‌లో పోరెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli: ధోనీ ముందే సీఎస్కే బౌలర్‌కు వార్నింగ్.. విరాట్ కోహ్లీ ఎలా సీరియస్ అయ్యాడో చూడండి..
మ్యాచ్ పోయినా రికార్డు మిగిలింది