Shubman Gill- Abrar Ahmed: గిల్‌కు ఇచ్చిన వార్నింగ్ ఏంటి.. పాక్ స్పిన్నర్‌ను నిలదీసిన లేడీ ఫ్యాన్
ABN , Publish Date - Apr 03 , 2025 | 04:36 PM
న్యూజిలాండ్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ రెండో ఓటమి ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వేల సంఖ్యలో ప్రజలు స్టేడియంకు తరలివచ్చారు. ఆ సమయంలో ఓ మహిళా అభిమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

న్యూజిలాండ్ (NZ vs Pak)తో బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ దారుణ ఓటమి చవిచూసింది. 84 పరుగుల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ రెండో ఓటమి ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వేల సంఖ్యలో ప్రజలు స్టేడియంకు తరలివచ్చారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత అభిమానులు కూడా స్టేడియంకు వెళ్లారు. ఆ సమయంలో ఓ మహిళా అభిమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed)ను ఓ మహిళా అభిమాని నిలదీసింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill)ను అవుట్ చేసిన తర్వాత పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్.. పెవలియన్ వైపు చూపిస్తూ సంజ్ఞలు చేశాడు. అప్పట్లో ఆ ఘటన వివాదాస్పదం అయింది. తాజాగా ఒక మహిళ అభిమాని న్యూజిలాండ్‌లో అబ్రార్ అహ్మద్‌ను ప్రశ్నించింది. అబ్రార్ మైదానంలో బౌండరీ లైన్ వద్దకు వచ్చినపుడు అక్కడ ఉన్న ఓ అభిమాని *శుభ్‌మన్ గిల్ కో క్యా ఇషారే కర్ రా థా? *(శుభ్‌మన్ గిల్‌కు మీరు ఏమని వార్నింగ్ ఇచ్చారు?) అని అడిగింది.
మహిళా అభిమాని అడిగిన ఆ ప్రశ్నను విన్న అబ్రార్ ఇబ్బందిపడుతూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపించలేదు. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, పాకిస్తాన్ తరఫున టీ-20లు మాత్రమే ఆడుతున్న అబ్రార్.. వన్డే తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు.
ఇవీ చదవండి:
స్టార్ యాక్టర్‌పై కోహ్లీ ఫ్యాన్స్ సీరియస్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి